Royal Challengers Bengaluru won by 12 Runs in IPL 2025 20th Match: ఐపీఎల్ 2025లో భాగంగా ముంబై వేదికగా వాంఖడే స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన ఉత్కంఠ పోరులో ముంబై పోరాడి ఓడింది. 222 పరుగులు లక్ష్యఛేదనలో ముంబై 9 వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసింది. దీంతో 12 పరుగుల తేడాతో బెంగళూరు చేతిలో ముంబై ఓటమి పాలైంది.
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. బెంగళూరు బ్యాటర్లలో విరాట్ కోహ్లీ(67, 42 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), రజత్ పాటీదార్(64, 32 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లు), జితేశ్ శర్మ(40, 19 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో బెంగళూరు భారీ స్కోరు సాధించింది. ముంబై బౌలర్లలో బౌల్ట్, హార్దిక్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. విఘ్రేశ్ వికెట్ తీశాడు.
222 పరుగుల భారీ లక్ష్యఛేదనలో ముంబై టాప్ ఆర్డర్ విఫలమైంది, ఓపెనర్లు రోహిత్ శర్మ(17), విల్ జాక్స్(22), సూర్యకుమార్(28), రికల్‌టన్(17) పెద్ద ఇన్నింగ్స్ ఆడడంతో విఫలమయ్యారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మ(56, 29 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), హార్దిక్ పాండ్య(42, 15 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపులు మెరింపించారు. ఈ దశలో బెంగళూరు బౌలర్లను హార్దిక్ వణికించాడు.
క్రీజులోకి వచ్చిన వెంటనే తొలి మూడు బంతులను 6, 4 ,6 బాదిన హార్దిక్ 8 బంతుల్లోనే 33 పరుగులు చేశాడు. ముంబైని గెలిపించేందుకు తీవ్రంగా ప్రయత్నించిన చివరికి 15 బంతుల్లో 42 పరుగులకు ఔట్ అయ్యాడు. అంతకుముందు తిలక్ కూడా భువనేశ్వర్ బౌలింగ్‌లో క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇక ముంబై విజయానికి చివరి ఓవర్‌లో 19 పరుగులు అవసరం ఉండగా.. నమన్(11), శాంటర్న్(8) ఔట్ అయ్యారు. కృనాల్ వేసిన ఈ ఓవర్‌లో కేవలం 6 పరుగులు లభించాయి. 12 పరుగుల తేడాతో బెంగళూరు విజయం సాధించింది. బెంగళూరు బౌలర్లలో కృనాలం పాండ్య 4 వికెట్లు, హేజిల్ వుడ్, దయాళ్ చెరో రెండు వికెట్లు, భువనేశ్వర్ వికెట్ తీశాడు.