Prime9

RCB Virat Kohli: విరాట్ కోహ్లీపై విమర్శలు.. ఎందుకో తెలుసా?

RCB Batter Virat Kohli Sledge Musheer Khan: రన్ మెషీన్ విరాట్ కోహ్లీ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడగా.. బెంగళూరు భారీ విజయం సాధించింది. అయితే, పంజాబ్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కోహ్లీ చేసిన సిగ్నల్స్ వివాదాస్పదంగా మారాయి. పంజాబ్ తరఫున ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన ముషీర్ ఖాన్‌ను ఉద్దేశించి ‘వాటర్ బాటిల్స్ అందించేవాడు బ్యాటింగ్‌కు వచ్చాడు’ అని విరాట్ కోహ్లీ హేళన చేశాడని కొంతమంది పంజాబ్ కింగ్స్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

 

కాగా, ఏంటీ కోహ్లీ నువ్వేనా? ఇలా చేసింది అని కామెంట్స్ చేస్తున్నారు. యువ ఆటగాళ్లకు మంచి లీడర్‌గ ఉండాలి. కానీ ఇలా చేయడం కరెక్టు కాదని అంటున్నారు. ప్రస్తుతం ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు, ముషీర్ ఖాన్‌పై విరాట్ కోహ్లీ అలాంటి ఉద్దేశం లేదని పలువురు క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. గత మ్యాచ్‌లో ముషీర్ ఖాన్‌కు బ్యాట్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడని విరాట్ ఫ్యాన్స్ గుర్తు చేస్తున్నారు. ఏదో ఆటపట్టించాలనే ఉద్దేశంతో అలా అని ఉంటాడని కామెంట్స్ చేస్తున్నారు. కావాలనే బ్యాటర్ దృష్టిని మళ్లించేందుకు కొంతమంది ఇలా చేస్తుంటారని, అందులో భాగంగానే కోహ్లీ అలా సిగల్స్ ఇచ్చి ఉంటాడని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version
Skip to toolbar