PV Sindhu to marry fiance Venkata Datta in Udaipur: భారత బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట సింధు ఆదివారం వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. పారిశ్రామికవేత్త వెంకట దత్తసాయిని సింధు ఏడడుగులు నడిచి ఒక్కటయ్యారు. రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో రఫల్స్ హోటల్లో ఆదివారం రాత్రి 11.30 గంటలకు సంప్రదాయ రీతిలో పెళ్లి జరిగింది. వివాహానికి ప్రధాని సహా దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు. ఈ నెల 24న హైదరాబాద్‌లో రిసెప్షన్ జరుగనున్నది. దీనికి పెద్దసంఖ్యలో అతిథులు హాజరు కానున్నారు.
చాలా కాలంగా స్నేహం..
సింధు, దత్తసాయి కుటుంబాల మధ్య చాలాకాలంగా స్నేహం ఉంది. ఇటీవల వీరి పెళ్లిని ఇరు కుటుంబాలు ఖాయం చేశాయి. హైదరాబాద్‌కు చెందిన డేటా మేనేజ్‌మెంట్ సొల్యూ షన్ సంస్థ ‘పొసి డెక్స్ టెక్నాలజీస్’ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా దత్తసాయి పనిచేస్తున్నారు.