Site icon Prime9

Pat Cummins: ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ తల్లి కన్నుమూత

Pat Cummins

Pat Cummins

Pat Cummins: ఆస్ట్రేలియా జట్టు సారథి పాట్ కమిన్స్ కు మాతృవియోగం కలిగింది. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కమిన్స్ తల్లి మారియా కమిన్స్ శుక్రవారం తెల్లవారు జామున కన్నుమూశారు. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా ట్విటర్ వేదికగా వెల్లడించింది.

 

సంతాపం తెలిపిన బీసీసీఐ, టీమిండియా(Pat Cummins)

‘ కొంతకాలంగా క్యాన్సర్ మహమ్మారి తో పోరాడుతున్న మారియా కమిన్స్ కన్నుమూశారు. ఆస్ట్రేలియా క్రికెట్ తరఫున పాట్ కమిన్స్ కు , అతని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాం.

సంతాప సూచికగా టీమిండియా తో జరుగుతున్న నాల్గో టెస్టు రెండో రోజు ఆటలో ఆసీస్ ఆటగాళ్లు నల్ల రిబ్బన్లు ధరిస్తారు.’ అంటూ సీఏ ట్వీట్ చేసింది.

అదే విధంగా పాట్ కమిన్స్ తల్లి మృతిపై బీసీసీఐ సహా టీమిండియా ఆటగాళ్లు కూడా తమ సంతాపాన్ని ప్రకటించారు.

‘ ఈ విషాద సమయంలో కమిన్స్, అతని కుటుంబసభ్యులకు మా సానుభూతి తెలుపుతున్నాం’ అని బీసీసీఐ ట్వీట్ చేసింది.

 

 

నల్ల రిబ్బన్లతో రెండో రోజు ఆట

కాగా. తన తల్లి అనారోగ్యం కారణంగా భారత్‌తో రెండో టెస్టు ముగిసిన తర్వాత పాట్ కమిన్స్‌ స్వదేశానికి వెళ్లిపోయాడు. మారియా కమిన్స్‌ 2005 నుంచి బ్రెస్ట్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు.

గత కొన్ని వారాలుగా వ్యాధి తీవ్రం కావడంతో ఆసుపత్రికి తరలించినట్లు పాట్ కమిన్స్‌ అప్పట్లో తెలిపాడు.

ప్రస్తుతం జరుగుతున్న నాలుగో టెస్టుతో పాటు మూడో టెస్టుకూ కమిన్స్ అందుబాటులో లేడు.

అతడి స్థానంలో స్టీవ్‌ స్మిత్‌ సారథ్య బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.

ప్యాట్‌ కమిన్స్‌ తల్లి మృతికి సంతాపంగా ఆసీస్‌ ఆటగాళ్లు నల్ల రిబ్బన్లతో రెండో రోజు ఆటను ప్రారంభించారు.

 

 

 

Exit mobile version