Site icon Prime9

India vs Pakistan: భారత్, పాకిస్థాన్ హై వోల్టేజ్ మ్యాచ్.. టాస్ ఓడిన భారత్

Pakistan own the toss and choose to bat first in ICC Champions Trophy 2025: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలోనే హై వోల్టేజ్ మరో కీలక మ్యాచ్ ప్రారంభం కానుంది. దుబాయ్ వేదికగా ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుంది. తొలుత టాస్ గెలిచిన పాకిస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే దాయాది జట్టుకు ఈ మ్యాచ్ చాలా కీలకం కాగా, ఈ మ్యాచ్‌లో గెలిచి సెమిస్‌కు బెర్తు ఖాయం చేసుకునేందుకు భారత్ చూస్తోంది.

అంతకుముందు ఈ స్టేడియంలో భారత్ ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఆరు మ్యాచ్‌ల్లో గెలుపొందింది. అయితే వరుసగా 12 సార్లు భారత్ టాస్ ఓడింది. గతంలో నెదర్లాండ్స్ 11 సార్లు టాస్‌ను కోల్పోయింది.

భారత్ జట్టు:
రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, కుల్‌దీప్ యాదవ్.

పాకిస్థాన్ జట్టు:
మహ్మద్ రిజ్వాన్(కెప్టెన్), ఇమామ్ ఉల్ హక్, బాబర్ అజామ్, సౌద్ షకీల్, సల్మాన్ అఘా, తయ్యబ్ తాహిర్, ఖుష్దిల్ షా, షహీన్ అఫ్రిది, నషీమ్ షా, హారిస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్.

Exit mobile version
Skip to toolbar