Site icon Prime9

Pakistan Team: పాకిస్థాన్‌కు బిగ్ షాక్.. ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి ఔట్

Pakistan knocked out ICC Champions Trophy 2025: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో పాకిస్థాన్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓడి సెమీస్ రేసు నుంచి ఆతిథ్య పాకిస్థాన్ నిష్ట్రమించింది. అయితే 2009 తర్వాత ఆతిథ్య జట్టు లీగ్ దశలోనే నిష్ట్రమించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఛాంపియన్స్ ట్రోఫీ ఆరంభించిన 6 రోజుల్లోనే ఆతిథ్య పాకిస్థాన్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. భారత్, న్యూజిలాండ్‌పై వరుస ఓటములతో ఆ జట్టు మరో మ్యాచ్ ఉండగానే సెమీస్ రేస్ నుంచి తప్పుకుంది. దాదాపు మూడు దశాబ్ధాల తర్వాత ఆ దేశంలో ఓ ఐసీసీ టోర్నీ జరుగుతోంది. కానీ ఆ ఆనందాన్ని ఆరు రోజులు కూడా ఆ దేశం నిలుపుకోలేకపోయింది. ఈ నెల 27న బంగ్లాదేశ్‌తో నామమాత్రపు మ్యాచ్ ఆడనుంది.

అయితే సుమారు 30 ఏళ్ల తర్వాత సొంతగడ్డపై జరుగుతున్న ఐసీసీ ట్రోఫీలో పాకిస్థాన్ కనీసం సెమీఫైనల్ కూడా చేరకుండా ఇంటి బాట పట్టింది. పాకిస్థాన్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోవడం, బంగ్లాదేశ్‌ను న్యూజిలాండ్ ఓడించడంతో పాకిస్థాన్ లీగ్ దశ నుంచే నిష్క్రమించింది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో మొత్తం 8 జట్లు బరిలోకి దిగగా.. గ్రూప్ ఏలో పాకిస్థాన్, భారత్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లు ఉన్నాయి. ఇందులో ఉన్న ప్రతీ జట్టు మిగతా మూడు జట్లతో మ్యాచ్‌లు ఆడనుంది. ఇప్పటికే భారత్, న్యూజిలాండ్ జట్లు రెండేసి మ్యాచ్‌లు గెలవగా.. బంగ్లాదేశ్, పాకిస్థాన్ జట్లు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓటమి చెందాయి. దీంతో భారత్, న్యూజిలాండ్ జట్లు సెమీస్‌కు చేరాయి. ఇక, ఈ నెల 27న బంగ్లాదేశ్‌తో పాకిస్థాన్ తలపడనుంది.

Exit mobile version
Skip to toolbar