Novak Djokovic Retires Due To Injury, Out Of Australian Open: టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ నుంచి వైదొలిగారు. జ్వెరెవ్‌తో జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ సెమీస్ తొలి సెట్‌లో 7-6 తేడాతో జకోవిచ్ ఓడిపోయాడు. గాయం కారణంతో అలెగ్జాండర్ జ్వెరెన్‌తో సెమీ ఫైనల్ మ్యాచ్ మధ్యలోనే రిటైర్ హర్ట్ ప్రకటించారు. దీంతో ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్‌కు జర్మనీ ఆటగాడు జ్వెరెవ్ చేరాడు. దీంతో 25వ గ్రాండ్ స్లామ్ గెలవాలన్న నోవాక్ జకోవిచ్ కల చెదిరిపోయింది.
తొలి సెట్‌ను 7-6తో కోల్పోయిన జకోవిచ్ ప్రత్యర్థికి షేక్ హ్యాండ్ ఇచ్చి డ్రాప్ అవుతున్నట్లు తెలిపారు. దీంతో అతడి ఫ్యాన్స్ షాక్ అయ్యారు. వాస్తవానికి క్వార్టర్ ఫైనల్ నుంచే జకోవిచ్ గాయంతో బాధపడుతున్నాడు. కార్లోస్ అల్కరాజ్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ సమయంలో గాయపడ్డాడు. అయితే సెమీస్ మ్యాచ్ మధ్యలో జకోవిచ్ నెట్ కి వెల్లి ప్రత్యర్థికి షేక్ హ్యాండ్ ఇచ్చి తన నిర్ణయాన్ని చెప్పాడు. దీంతో జ్వెరెన్ ఫైనల్ చేరినట్లు ప్రకటించారు. కాగా, ఆదివారం జరగే ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్ మ్యాచ్‌లో బెన్ షెల్టాన్, జానిక్ సిన్నర్ మధ్య జరిగే మ్యాచ్ విన్నర్‌తో జ్వెరెవ్ తలపడనున్నాడు.