Prime9

Nicholas Pooran Retirement: రిటైర్మెంట్ ప్రకటించిన మరో స్టార్ క్రికెటర్..

Nicholas Pooran Announced Retirement From International Cricket: అంతర్జాతీయ క్రికెట్‌కు మరో స్టార్ క్రికెటర్ రిటైర్మెంట్ ప్రకటించి ఫ్యాన్స్‌కు బిగ్ షాక్ ఇచ్చాడు. వెస్టిండీస్ విధ్వంసక ప్లేయర్ నికోలస్ పూరన్ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు అందులో రాసుకొచ్చారు.

 

‘అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నా. నేను తీసుకున్న ఈ నిర్ణయం చాలా కష్టంగానే ఉంది. అయినప్పటికీ ఈ విషయంపై సుదీర్ఘంగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నా. నేను ఇష్టంతో ఆడానని, చాలా ఇచ్చింది. వెస్టిండీస్‌కు ఆడడం ఆనందంగా ఉంది. కెప్టెన్‌గా వ్యవహరించడం మరిచిపోలేనిది. అందరికీ ధన్యవాదములు.’ అని అందులో పేర్కొన్నారు.

 

వెస్టిండిస్ తరఫున 29 ఏళ్ల నికోలస్ పూరన్.. 106 టీ20 మ్యాచ్‌లు ఆడగా.. 2,275 పరుగులు, 61 వన్డేల్లో 1,983 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు ఉన్నాయి. అలాగే ఐపీఎల్‌లో పూరన్ చాలా దూకుడుగా ఆడాడు. లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు ఆడిన పూరన్ సిక్స్‌ల వర్షం కురిపించాడు. మొత్తం 14 మ్యాచ్‌ల్లో 524 పరుగులు చేసి టాప్‌లో ఉన్నాడు. కాగా, నికోలస్ పూరన్ అందించిన సేవలకు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ధన్యవాదాలు చెబుతూ ట్వీట్ చేసింది.

 

 

Exit mobile version
Skip to toolbar