New Zealand beat Pakistan by 60 runs to win in Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా కరాచీ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో పాకిస్థాన్ 60 పరుగుల తేడాతో ఓడిపోయింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన న్యూజిలాండ్.. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 320 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో ఓపెనర్ విల్ యంగ్(107, 113 బంతుల్లో 12 ఫోర్లు, సిక్స్), లేథమ్(118, 104 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించగా.. గ్లెన్ ఫిలిప్స్(61, 39 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్ ఆడడంతో న్యూజిలాండ్ 320 పరుగుల భారీ స్కోరు సాధించింది. కాన్వే(10), విలియమ్సన్(1), డరిల్ మిచెల్(10) పరుగులు చేశారు. పాకిస్థాన్ బౌలర్లలో నసీమ షా, రవూఫ్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. అబ్రార్ అహ్మద్ ఒక వికెట్ తీశాడు.
లక్ష్య ఛేదనలో పాకిస్థాన్ తడబడింది. 47.2 ఓవర్లకు 260 పరుగులు చేసి ఆలౌట్ అయింది. పాకిస్థాన్ బ్యాటర్లలో బాబర్ ఆజామ్(64, 90 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్), కుష్‌దిల్ షా(69, 49 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్) రాణించినా.. మిగతా బ్యాటర్లు విఫలం కావడంతో ఓటమి చవిచూసింది. తొలుత 10 ఓవర్లకు పాకిస్థాన్ 2 వికెట్లు కోల్పోయి కేవలం 22 పరుగులు మాత్రమే చేసింది. తర్వాత సల్మాన్ ఆఘా(42, 28 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్) స్కోరు పెంచేందుకు ప్రయత్నించినా సాధ్యపడలేదు. వరుసగా వికెట్లు కోల్పోవడంతో ఓటమి ఖరారైంది. షకీల్(6), రిజ్వాన్(3), ఫకార్ జమాన్(24), తయ్యబ్ తాహిర్(1), షహీన్ షా అఫ్రిది(14), నషీమ్ షా(13), రవూఫ్(19) పరుగులు చేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో శాంట్నర్, ఒరూర్క్ చెరో 3 వికెట్లు పడగొట్టగా.. మ్యాట్ హెన్రీ, బ్రాస్ వెల్, నాథన్ స్మిత్ తలో వికెట్ తీశారు.