ఫిఫా వరల్డ్ కప్: ఫ్రెంచ్ స్టార్ ప్లేయర్ ఎంబాపెను ఓదార్చడానికి కదిలివచ్చిన ఫ్రాన్స్ దేశాధ్యక్షుడు.. మేక్రాన్ పై నెటిజన్ల ఫిదా

ఖతార్‌ వేదికగా జరిగిన ఫిఫా ప్రపంచకప్ విజేతగా అర్జెంటీనా జట్టు నిలిచింది. కాగా ఆటలో ఓడి నిరాశలో ఉన్న ఎంబాప్పేను ఓదార్చడానికి స్వయంగా ఫ్రాన్స్ దేశాధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ మైదానంలోకి వచ్చారు.

FIFA World Cup: ఖతార్‌ వేదికగా జరిగిన ఫిఫా ప్రపంచకప్ విజేతగా అర్జెంటీనా జట్టు నిలిచింది. ఆదివారం రాత్రి లూసెయిల్ స్టేడియంలో జరిగిన ఫిఫా ప్రపంచకప్ ఫైనల్‌లో టైటిల్ ఫేవరెట్ గా అర్జెంటీనా, డిఫెండింగ్ ఛాంపియన్స్ గా ఫ్రాన్స్ బరిలోకి దిగగా ఇరు జట్ల మధ్య నరాలు తెగేలా ఉత్కంఠ పోరు జరిగింది. మూడు సార్లు ఎక్స్ ట్రా టైం ఇచ్చినా కానీ ఇరు జట్లు 3-3 గోల్స్ తో సమాన స్కోర్ చెయ్యడం వల్ల ఫైనల్ గా పెనాల్టీ షూటౌట్‌ టైం ఇచ్చారు. షూటౌట్ రౌండ్లో అర్జెంటీనా 4-2తో విజయం సాధించి 36ఏళ్ల తమ వరల్డ్ కప్ కలను నెరవేర్చుకుంది.

మ్యాచ్ వివరాల్లోకి వెళ్తే మొత్తంగా 90 నిమిషాల మ్యాచ్లో ఆరంభంలో 80 నిమిషాల పాటు మ్యాచ్ ఏకపక్షంగా సాగింది. అర్జెంటీనా 2 గోల్స్ చేసింది. ఫ్రాన్స్ ఒక్క గోల్ కూడా చేయలేదు. అప్పుడు ఫ్రెంచ్ స్టార్ స్ట్రైకర్ కైలియన్ ఎంబాపె రెండు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ చేసి మ్యాచ్ మొత్తాన్ని ఓ మలుపు తిప్పాడు. దానితో 80వ నిమిషంలో తొలి గోల్‌ పెనాల్టీ షూట్‌ కాగా, 81వ నిమిషంలో రెండో గోల్‌ నమోదైంది. ఇలా మ్యాచ్ ముగిసే సరికి ఇరు జట్లు సమాన స్కోరును చేసింది. ఆ తర్వాత రెండు సార్లు 30 నిమిషాల ఎక్స్ ట్రా టైం ఇవ్వడంతో 118వ నిమిషంలో ఎంబాపె మూడో గోల్‌ చేసి స్కోరు సమం చేశాడు. అయినా కానీ ఎంబాపెకు నిరాసే మిగిలింది. హ్యాట్రిక్ గోల్స్ కొట్టినా కానీ ఫ్రాన్స్‌కు పరాభవం ఎదురైంది.

Messi deserved to
win but Mbappe didn’t deserve to lose. He almost single-handedly took
France to the edge of victory. And in his complete disdain for the
dictator-loving @EmmanuelMacron,
he shows that he’s the king even after the final whistle. pic.twitter.com/WVYFjMl7yF


Idrees Ahmad (@im_PULSE) December
18, 2022

El presidente de

Francia, Emmanuel Macron, consuela a #Mbappé
tras la derrota de la selección francesa.

¡Que
grande, Macron! ¡Que grande!

❤️ pic.twitter.com/vhBfPd7xcp


Carlos Disla (@CarlosDislaR) December
18, 2022

మ్యాచ్ గెలిచిన అర్జెంటీనా జట్టు మైదానమంతా పరిగెడుతుంటే, ఫ్రెంచ్ స్టార్ ప్లేయర్ ఎంబాపె మాత్రం తీవ్ర భావోద్వేగంతో గ్రౌండ్ లో కూలబడిపోయాడు. అతన్ని అలా చూసిన అభిమానులు సైతం విషాదంలో మునిగిపోయారు. దానితో అతడిని ఓదార్చేందుకు, ధైర్యం చెప్పేందుకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ స్వయంగా మైదానంలోకి కదలివచ్చారు. ఎంబాపేను కౌగలించుకుని, తలను నిమురుతూ తన సొంత పిల్లాడిని సముదాయించినట్టుగా ఓదార్చుచుతూ చాలాసేపు మాట్లాడారు.

La célébration
d’Emmanuel Macron sur l’égalisation de l’Equipe
de France qui nous a emmené aux tirs au but. 🇫🇷 pic.twitter.com/3A0fGroUz5


Footballogue (@Footballogue) December
18, 2022

ఆ తరువాతే ఎంబాపే లేచి నిలబడి తనను తాను కాస్త కంట్రోల్ చేసుకుని కళ్లనీళ్లతో మైదానం వీడాడు. కాగా ప్రస్తుతం మేక్రాన్ ఎంబాపేను ఓదారుస్తున్న వీడియో సైతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. మేక్రాన్ మైదానంలోకి రాకముందే, అర్జెంటీనా కీపర్ ఎమిలియానో ​​మార్టినెజ్ ఎంబాపే చేయి పట్టుకుని ఓదార్చడం కూడా కనిపించింది.

 

దేశాధ్యక్షుడే స్వయంగా వచ్చి తమదేశపు ఆటగాడిపై చూపించిన ప్రేమకు యావత్ ప్రపంచ జనం ఫిదా అయిపోయారు. అసలైన దేశాధ్యక్షుడంటే అతడే అంటూ మేక్రాన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. మరికొందరైతే మేక్రాన్ ఐ లవ్ యూ అంటూ ప్రొఫైల్స్ మార్చేస్తూ ట్వీట్లు కామెంట్లు నెట్టింట పంచుకుంటున్నారు.

మేక్రాన్ ప్రపంచకప్ తుదిపోరు జరుగముందు ఫ్రాన్స్ ప్లేయర్ల డ్రస్సింగ్ రూమ్ లో సమావేశమై ఆటగాళ్లను ఉత్సాహరిచారు. గెలుపోటములు లెక్కచెయ్యకుండా ఉత్తమ ప్రతిభ కనపరిచి తమ దేశానికి కప్పును తీసుకురావాలంటూ వారిలో ధైర్యాన్ని పోరాటప్రతిభను రంగరించి మైదానంలోకి పంపారు.

అంతేకాకుండా ఆట జరుగుతున్నంత సేపు స్టేడియంలో ఉండి ఆటను ఓ సాధారణ ప్రేక్షకుడిలా ఎంతో మైమరిచి చూస్తూ తమ ఆటగాళ్లు కొదమ సింహాల్లా తలపడుతూ గోల్స్ సాధిస్తుంటే తనను తాను మైమరిచిన ఆనందంతో స్టాండింగ్ ఒవేషన్ చేసి చప్పట్లు కొడుతూ సంతోషం వ్యక్తం చేశారు.

ఇదిలా ఉంటే ఆటఆధ్యంతం వారు చూపిన ఆటతీరును ప్రసంసిస్తూ ఆటముగిసి నిరాశలో ఉన్న టీమ్ మరోమారు కలిసి వారిని ఓదార్చారు. వీటన్నింటికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారడంతో ఫ్రాన్స్ దేశ అధ్యక్షుడు మేక్రాన్ పై నెటిజన్లు మనసుపారేసుకుంటున్నారు. ఒక గొప్ప నాయకుడంటే మేక్రాన్ అంటూ అభినందిస్తున్నారు.
WATCH: #BNNQatar

Rpoerts

President @EmmanuelMacron‘s
reaction after #Mbappe
equalized for #France
against #Argentina.#Argentina
2 – #France
2. #WorldCup
#Qatar2022
#FIFAWorldCup2022
#FRAARG
#Mbappe
#Argentina
#France
#ARGFRA
#FIFAWorldCup
#Messi
pic.twitter.com/NntQrUecHX


Gurbaksh Singh Chahal (@gchahal) December
18, 2022

ఇకపోతే ఫ్రాన్ సాకర్ జట్టును ఉద్దేశించి ఆ దేశ అధ్యక్షుడు మేక్రాన్ నెట్టింట ఓ ట్వీట్ చేశారు. తమ అసమాన ఆటతీరు, పోరాటపటిమతో యావత్ ప్రపంచాన్ని మెప్పించిన ఫ్రెంచ్ జట్టుకు అభినందనలు. మీరు దేశాన్ని మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాకర్ మద్దతుదారులను మీ ఆటతీరుతో ఎంతో థ్రిల్ చేసారు. విజయం సాధించిన అర్జెంటీనాకు అభినందనలు అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఇలా ఆయన మానవీయత మరియు తన దేశఆటగాళ్లపట్ల మేక్రాన్ చూపిన ప్రేమ ఆదరణకు మాటల్లేవ్ మాట్లాడుకోవడాల్లేవ్ మేక్రాన్ ఈజ్ గ్రేట్ లీడర్ అంటున్నారు నెటిజన్లు.

ఇదీ చదవండి: లియోనాల్ మెస్సీ : ఆ విషయంలో క్రికెట్ గాడ్ సచిన్ తో మెస్సీకి పోలిక..