Kane Williamson: న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ సూపర్ ఫామ్ కొనసాగిస్తున్నాడు. శ్రీలంకపై తొలి టెస్టులో సెంచరీతో కివిస్‌ను గెలిపించిన కేన్.. రెండో టెస్టులోనూ విజృంభించాడు. కేన్ విలియమ్స్ న్ టెస్టు కెరీర్‌లో ఆరో డబుల్ సెంచరీని నమోదు చేసుకున్నాడు.
సచిన్, రికీ పాంటింగ్ సరసన(Kane Williamson)
శ్రీలంకపై 296 బంతుల్లో 215 పరుగులు చేశాడు. ఈ క్రమంలో రాహుల్ ద్రవిడ్ (5), జో రూట్ (5)ను అధిగమించాడు.
సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, రికీ పాంటింగ్ లాంటి దిగ్గజ క్రికెటర్ల రికార్డును సమం చేశాడు.
కాగా, వీరు టెస్టుల్లో ఆరు డబుల్ సెంచరీల మైలురాయిని దాటారు.
సుదీర్ఘ ఫార్మాట్‌లో అత్యధికంగా సర్ డాన్ బ్రాడ్‌మన్ కేవలం 52 టెస్టుల్లోనే 12 ద్విశతకాలను సాధించాడు.
తొలి ఇన్నింగ్స్ 580 వద్ద డిక్లేర్డ్(Kane Williamson)
ప్రస్తుతం కేన్ విలియమ్సన్ 94వ టెస్టు ఆడుతున్నాడు. మొత్తం 8,124 పరుగులు సాధించాడు.
ఇందులో 6 డబుల్ సెంచరీలు, 28 సెంచరీలు, 33 అర్ధశతకాలు ఉన్నాయి.
ప్రస్తుతం శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ తమ తొలి ఇన్నింగ్స్‌ను 580/4 స్కోరు వద్ద డిక్లేర్డ్ చేసింది.
కేన్ విలియమ్సన్‌తో పాటు హెన్రీ నికోల్స్ (200*) ద్విశతకం బాదాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 363 పరుగులను జోడించారు.
అంతకు ముందు డేవన్ కాన్వే (78) కూడా అర్ధశతకం సాధించాడు. కాగా, రెండు టెస్టుల సిరీస్‌లో కివీస్ 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది.
కాగా, శ్రీలంకతో జరిగిన తొలి టెస్ట్‌లో సూపర్ సెంచరీతో (121) మెరిసిన కేన్ మామ.. ఐదు రోజుల వ్యవధిలో ఏకంగా డబుల్ సెంచరీతో (215) చెలరేగాడు.
కేన్ మామకు ఇది హ్యాట్రిక్ సెంచరీ కావడం విశేషం. శ్రీలంకతో తొలి టెస్ట్‌కు ముందు ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్ట్‌లోనూ కేన్ మామ శతక్కొట్టాడు (132).