IPL Schedule 2025 New Captains Punjab Kings title Hopes shreyas Captaincy: ఐపీఎల్ 2025 మెగా టోర్నీకి మరో 9 రోజులే సమయం ఉంది. క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ టోర్నీ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. ఈ మెగా లీగ్‌లో టైటిల్ సాధించడమే లక్ష్యంగా 10 జట్లు బరిలోకి దిగుతున్నాయి. తొలి మ్యాచ్ కోల్‌కతాలో ఈర్డెన్ గార్డెన్స్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరగనుంది.
అయితే, ఐపీఎల్ 2025లో కొన్ని జట్లకు కొత్త కెప్టెన్లు వచ్చారు. ఐపీఎల్ ప్రారంభం నుంచి నేటి వరకు పంజాబ్ కింగ్స్, బెంగళూరు, ఢిల్లీ జట్లకు టైటిల్ కల నెరవేరలేదు. ఈ తరుణంలో ఈ జట్లకు కొత్త సారథులు వచ్చారు. ఇందులో ప్రధానంగా పంజాబ్ జట్టుపై ఆసక్తి నెలకొంది. ఈ జట్టుకు కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ రావడంతో ఆశలు పెరిగాయి. ఇప్పటికే శ్రేయస్ అయ్యర్ ఛాంపియన్స్ ట్రోఫీలో మంచి ఫామ్ కొనసాగించడంతో పాటు భారత్ ట్రోఫీ అందుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మేరకు ఐపీఎల్‌లో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో టైటిల్ నెగ్గుతుందని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఐపీఎల్ తొలి సీజన్‌లో పంజాబ్ సెమీస్ చేరినా.. చివరిలో విఫలమైంది. 2014లో ఫైనల్ చేరిన ఈ జట్టును కోల్‌కతా ఓడించింది. అప్పటినుంచి ఇప్పటివరకు లీగ్ దశలోనే ఇంటిబాట పడుతోంది. అయితే, గత సీజన్‌లో కోల్‌కతా జట్టుకు టైటిల్ అందించిన శ్రేయస్ అయ్యర్.. ఈాసారి పంజాబ్ జట్టుకు సారథ్యం వహించడంతో పంజాబ్ రాత మారుతాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే, కెప్టెన్‌గా బ్యాటర్‌గా శ్రేయస్ ముందుండి నడిపించాలని పంజాబ్ ఫ్రాంచైజీ కోరుకుంటుంది. పంజాబ్ కింగ్స్‌లో స్లాయినిస్, మ్యాక్స్ వెల్, యాన్సెన్, అజ్మతుల్లా ఆల్ రౌండర్లు ఉండగా.. జోస్ ఇంగ్లిస్, ఆరోన్ హార్డీ, బార్ట్ లెట్, పెర్గూసన్, అర్స్ దీప్, చాహల్ వంటి కీలక ఆటగాళ్లు ఉన్నారు.
కాగా, ఇప్పటివరకు పంజాబ్ జట్టకు 17 మంది జట్టుకు కెప్టెన్లుగా వ్యవహరించారు. 2008-09లో యువరాజ్ సింగ్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇందులో ఆడిన 29 మ్యాచ్‌ల్లో 17 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా.. మిగతా మ్యాచ్‌ల్లో ఓటమి చెందింది. ఆ తర్వాత 2010లో సంగక్కర, జయవర్దనేలు, 2011-2013 వరకు గిల్ క్రిస్ట్, డేవిడ్ హస్సీ, 2014 -15లో ఆస్ట్రేలియా ఆటగాడు జార్జ్ బెయిలీ, వీరేంద్ర సెహ్వాగ్, ఆ తర్వాత డేవిడ్ మిల్లర్, మురళి విజయ్, మ్యాక్స వెల్, రవిచంద్రన్ అశ్విన్, కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, శిఖర్ ధావన్, శ్యామ్ కిరణ్, జితేష్ మోహన్ శర్మలు కెప్టెన్‌గా వ్యవహరించారు. తాజాగా, ఐపీఎల్ 2025 సీజన్‌కు శ్రేయస్ అయ్యర్‌కు పగ్గాలు అప్పగించారు. శ్రేయస్ సారథ్యంలో పంజాబ్ ఏవిధంగా సత్తా చాటుతుందో చూడాలి మరి.