Site icon Prime9

IPL-2025: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. ఫైనల్ మ్యాచ్ ఎక్కడంటే?

IPL 2025 Schedule Released: ఐపీఎల్ 2025 సీజన్‌కు సంబంధించి కీలక అప్‌డేట్‌ వచ్చేసింది. ఈ ఏడాది మార్చి 21 నుంచి ప్రారంభం కానుందని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా వెల్లడించారు. అలాగే మే 25న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఫైనల్‌ మ్యాచ్ ఉంటుందని తెలిపారు. బీసీసీఐ ప్రత్యేక సాధారణ సమావేశం ముంబయిలో జరిగింది.

ఈ మీటింగ్ అనంతరం రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడారు. ఐపీఎల్‌కు కొత్త కమిషనర్‌ను ఎన్నుకుంటామని వెల్లడించారు. ఐపీఎల్ పూర్తి స్థాయి షెడ్యూల్‌ను మరికొద్ది రోజుల్లో విడుదల చేసే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా, బీసీసీఐ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించి ఐసీసీ ఛైర్మన్‌గా జైషా పదవి చేపట్టారు. అయితే జైషా స్థానంలో కొత్త కార్యదర్శిగా దేవజిత్ సైకియా, ట్రెజరర్‌గా ప్రభ్‌తేజ్‌ సింగ్‌ భాటియా ఎంపికైనట్లు బీసీసీఐ ఎస్‌జీఎం వెల్లడించింది.

Exit mobile version