Site icon Prime9

Yuzvendra Chahal: విడాకులు తీసుకోనున్న మరో భారత క్రికెటర్.. అందుకే డిలీట్ చేశాడా?

Yuzvendra Chahal And Dhanashree Verma Divorce Rumours: భారత స్టార్ క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ విడాకులు తీసుకుంటున్నట్లు పుకార్లు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా, యుజ్వేంద్ర చాహల్.. తన భార్య, కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మను ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో అన్ ఫాలో చేశాడు. ఆ తర్వాత ధనశ్రీ కూడా చాహల్‌ను అన్ ఫాలో చేసింది. దీంతో ధనశ్రీ వర్మకు సంబంధించిన ఫోటోలను యుజ్వేంద్ర చాహల్ తన అకౌంట్ నుంచి తొలగించాడు. ఈ పరిణామాలతో ఆ ఇద్దరూ కచ్చితంగా విడాకులు తీసుకుంటారని సోషల్ మీడియాలో పలువురు నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్లు చక్కర్లు కొడుతున్నాయి.

క్రికెట్ ప్రపంచంలో యుజేంద్ర చాహల్ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. తన స్పిన్ టెక్నిక్‌తో అందరినీ ముప్పుతప్పలు పెట్టాడు. ముఖ్యంగా ఐపీఎల్‌లో కీలక సమయాల్లో వికెట్లు తీసి జట్టుకు విజయాలను అందించాడు. ఈ ఏడాది జరిగే ఐపీఎల్‌లో ఆయన అధిక రేటుకు అమ్ముడుపోయాడు. పంజాబ్ కింగ్స్ చాహల్‌ను ఏకంగా రూ. 18కోట్లు పెట్టి మరి కొనుగోలు చేసుకుంది. దీంతో చాహల్ పేరు ఒక్కసారిగా మార్మోగిపోయింది.

అయితే, తన వ్యక్తిగత విషయాలపై గత కొంతకాలంగా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. తొలుత 2023లో కొరియోగ్రాఫర్, నటి, మోడల్ ధనశ్రీ.. తన భర్త యుజేంద్ర చాహల్‌ను అన్ ఫాలో చేసింది. దీంతో వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నారని రూమర్స్ వచ్చాయి. ఆ సమయంలో ఇదే టాపిక్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయింది. తాజాగా, చాహల్, ధనశ్రీ ఒకరినొకరు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్స్ డిలీట్ చేసుకోవడంతో మరోసారి విడాకులు తీసుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ విషయంపై యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.

ఇదిలా ఉండగా, చాహల్, ధనశ్రీ ఇద్దరూ లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. 2020లో ప్రేమ వివాహం చేసుకోగా.. అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. క్యూట్ కపుల్స్ అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు తెగ కామెంట్స్ చేశారు. తర్వాత అన్యోన్యంగా జీవించారు. ధనశ్రీపై కామెంట్స్ వస్తే స్వయంగా చాహల్ స్పందించేవాడు. అయితే గత కొంతకాలంగా చాహల్ స్పందించకపోవడంతో వీరిద్దరూ తమ వివాహ జీవితానికి ముగింపు పలుకుతున్నట్లు వస్తున్న వార్తలకు బలం చేకూరుస్తున్నాయి.

 

Exit mobile version