India Women vs West Indies Women 2odi match Harleen Deol century: వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో వన్డేలో భారత మహిళల జట్టు భారత్ భారీ స్కోర్ సాధించింది. వదోదర వేదికగా కోటంబి మైదానంలో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై భారత్ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసింది.
తొలుత టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు స్మృతి మంధాన(53), ప్రతీకా రావల్(76) దూకుడుగా ఆడారు. తొలి వికెట్‌కు కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. వీరిద్దరూ 110 పరుగులు జోడించారు. 16.3 ఓవరల్లో స్మృతి మంధాన రనౌట్ అయింది. తర్వాత వన్ డౌన్ వచ్చిన హర్లీన్ డియోల్(115) వీరోచిత ఇన్నింగ్స్ ఆడింది. 103 బంతుల్లో 115 పరుగులు చేయడంతో భారత్ భారీ స్కోరు సాధించింది. జెమిమా రోడ్రిగ్స్(52)తో కలిసి 116 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. హర్మన్ ప్రీత్ కౌర్(22), రిచా ఘూష్(13), దీప్తి శర్మ(4) పరుగులు చేశారు. వెస్టిండీస్ బౌలర్లలో అఫీ ప్లెచర్, జైదా జేమ్స్, జోసెప్, డాటిల్ తలో వికెట్ తీశారు.
ఇదిలా ఉండగా, వన్డేల్లో మహిళల జట్టుకు 350కి పైగా పరుగులు చేయడం ఇది రెండోసారి కావడం విశేషం. అంతకుముందు 2022లో ఐర్లాండ్‌పై 5 వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసింది. అయితే భారత్‌కు సొంత గడ్డపై భారీ స్కోరు చేయడం ఇదే తొలిసారి.