Site icon Prime9

India Women vs Ireland Women: ఐర్లాండ్ వర్సెస్ భారత్.. రెండో వన్డేలో భారత్ ఘన విజయం

India Women vs Ireland Women cricket match: ఐర్లాండ్ ఉమెన్స్ టీంతో జరిగిన రెండో వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. ఆదివారం రాజ్ కోట్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 116 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది. దీంతో మరో మ్యాచ్ ఉండగానే స్మృతి మంధాన సేన మూడు వన్డేల టోర్నీలో 2-0 తో సిరీస్‌ను కైవసం చేసుకుంది.

తొలుత బ్యాటింగ్ చేపట్టిన భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 370 పరుగులు చేసింది. భారత్ బ్యాటర్లలో జెమీమా(102) సెంచరీ చేయగా.. హర్లీన్(89), స్మృతి మంధాన(73), ప్రతికా రావల్(67) పరుగులు చేశారు. ఐర్లాండ్‌ బౌలర్లలో ఓర్లా, కెల్లీ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. డెంప్సీ ఒక వికెట్‌ తీశారు. అనంతరం లక్ష్య ఛేదనలో ఐర్లాండ్‌ .. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు నష్టానికి 254 పరుగులు మాత్రమే చేసింది. ఐర్లాండ్ బ్యాటర్లలో కౌల్టర్‌ (80) రాణించగా.. ఫార్బెస్‌ (38), డెలానీ (37), పాల్‌ (27) ఫర్వాలేదనిపించారు. ఇక, భారత్‌ బౌలర్లలో దీప్తి శర్మ 3 వికెట్లు పడగొట్టగా.. ప్రియా మిశ్రా 2, సాధు, సయాలి తలో వికెట్‌ తీశారు.

Exit mobile version