Site icon Prime9

India vs south africa: పోరాడి ఓడిన భారత్‌.. 3 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా విజయం

India vs South Africa 2nd T20: దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత్ ఓటమి పాలైంది.చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. ఓపెనర్లు సంజూ శాంసన్ డకౌట్ కాగా, అభిషేక్ శర్మ(4) పరుగులకే పెవిలియన్ చేరాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్(4) పరుగుల వద్ద ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. మిగిలార్డర్‌లు తిలక్‌ వర్మ (20), అక్షర్‌ పటేల్‌ (27), హార్దిక్‌ పాండ్య (39*) రాణించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో జాన్‌సెన్‌, కొయెట్జీ, సైమ్‌లేన్‌, మార్‌క్రమ్‌, పీటర్‌ తలో వికెట్‌ తీశారు.

అనంతరం లక్ష్యఛేదనలో దక్షిణాఫ్రికా ఒక ఓవర్ ఉండగానే లక్ష్యాన్ని పూర్తి చేసింది. 19 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. స్టబ్స్‌(47) పరుగులతో రాణించగా.. రీజా హెండ్రిక్స్(24), గెరాల్డ్ కోయెట్జీ(19) పర్వాలేదనిపించారు. భారత్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 5 వికెట్లు తీయగా.. అర్ష్ దీప్ సింగ్, రవి బిష్ణోయ్ తలో వికెట్ పడగొట్టారు.

Exit mobile version