Site icon Prime9

India vs South Africa: నేడు భారత్, దక్షిణాఫ్రికా తొలి టీ20 మ్యాచ్.. సిరీస్ లక్ష్యంగా బరిలోకి దిగుతోన్న భారత్

India vs South Africa 1st ODI Match: భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య నేటి నుంచి నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. నవంబర్ 8వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీలో భారత్‌కు సూర్యకుమార్ యాదవ్ సారథ్యం వహిస్తున్నారు. ఈ సిరీస్ కోసం దక్షిణాఫ్రికాకు బయలుదేరిన భారత్ క్రీడాకారులకు ఘన స్వాగతం పలికారు. భారత కాలమానం ప్రకారం.. తొలి మ్యాచ్ రాత్రి 8.30 గంటలకు ప్రారంభం కానుంది. మొదటి టీ20 మ్యాచ్ డర్బన్ వేదికగా జరుగుతుండగా.. తొలుత టాస్ గెలిచే జట్టు బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మ్యాచ్‌లను స్పోర్ట్స్18 నెట్‌వర్క్‌తో పాటు జియో సినిమాలో ప్రసారం కానుంది.

భారత్ ప్లేయింగ్ స్క్వాడ్: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వైస్ కెప్టెన్), తిలక్ వర్మ, జితేష్ శర్మ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రమణదీప్ సింగ్ , వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, విజయ్‌కుమార్ వైషాక్, అవేష్ ఖాన్, యశ్‌ఖాన్, దయాల్, రింకూ సింగ్.
దక్షిణాఫ్రికా ప్లేయింగ్ స్క్వాడ్: ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్), రీజా హెండ్రిక్స్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, పాట్రిక్ క్రుగర్, డోనోవన్ ఫెరీరా, హెన్రిచ్ క్లాసెన్, ర్యాన్ రికెల్టన్, ఒట్నీల్ బార్ట్‌మన్, గెరాల్డ్ కోయెట్జీ, కేశవ్ మహరాజ్, మిహ్లాలీ మ్పయోంగ్వానా.

Exit mobile version