India vs New Zealand ICC Champions Trophy final match today: ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ 2025లో నేడు రసవత్తర మ్యాచ్ జరగనుంది. ఇందులో భాగంగానే రోహిత్ సేన మరో యుద్ధానికి సిద్ధమయింది. ఇప్పటివరకు ఆడిన మ్యాచులు ఒకెత్తయితే.. ఇది మరో ఎత్తు కావడం విశేషం. దుబాయ్ వేదికగా మధ్యాహ్నం 2.30 నిమిషాలకు న్యూజిలాండ్‌తో ఫైనల్ మ్యాచ్‌లో తలపడనుంది. మరో వైపు క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇరు జట్ల బలాలను పరిశీలిస్తే.. భారత్‌తో పాటు కివీస్ జట్టు కూడా బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లోనూ పటిష్టంగా ఉంది. భారత్ బ్యాటింగ్ విభాగంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి రాణిస్తే విజయం పెద్ద కష్టమేమి కాదు. వీరితో పాటు గిల్, శ్రేయస్, రాహుల్ నిలకడగానే ఆడుతున్నారు. ఆల్ రౌండర్ విభాగంగాలో అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, జడేజా భారత జట్టుకు అదసపు బలం. అలాగే కివీస్‌లో రచిన్ రవీంద్ర, విలియమ్సన్ మంచి ఫామ్‌లో కొనసాగుతుండగా.. మిచెల్, ఫిలిప్స్‌లు బ్యాటింగ్ జట్టుకు బలం చేకూరనుంది. ఇరు జట్లు స్పిన్ విషయంలో మెరుగ్గానే ఉన్నాయి.
అయితే, ఛాంపియన్స్ ట్రోఫీలో వరుస విజయాలతో భారత్ జోరు మీద ఉండగా.. న్యూజిలాండ్ జట్టు కూడా అంతే కాన్ఫిడెంట్‌గా కనిపిస్తోంది. భారత్‌లో ఆటగాళ్లు ఫామ్‌లో ఉండడంతో పాటు ఒకే వేదికలో ఆడటం కలిసొచ్చే అవకాశం ఉంది. కాగా, ఐసీసీ ఈవెంట్లలో భారత్‌పై కివీస్‌దే పైచేయి కావడం కలవరపెడుతోంది.
ఇక, ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో ఎవరు గెలుస్తారనే విషయంపై ఏఐ చాట్‌బోట్స్‌ను ప్రశ్నించగా.. భారత్ వైపే మొగ్గు చూపాయి. ఇరు జట్ల మధ్య టఫ్ ఫైట్ ఉన్నా భారత్‌కే ఎడ్జ్ ఉంటుందని గూగుల్ జెమిని తెలిపింది. అయితే ఖచ్చితంగా భారత్ గెలుస్తుందని ఓపెన్ ఏఐ చాట్ జీపీటీ, మైక్రోసాప్ట్ కోఫైలట్ స్పష్టం చేశాయి. అలాగే తీవ్ర ఉత్కంఠ నెలకొన్న ఈ మ్యాచ్ ఫలితాలను అంచనా వేయలేమని డీప్ సీక్ పేర్కొంది. ఇక, ఈ మ్యాచ్‌ను లైవ్ జియో హాట్ స్టార్, స్టార్ స్పోర్ట్స్‌లో చూడొచ్చు.
భారత్ జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), గిల్, కోహ్లి, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, రాహుల్(వికెట్ కీపర్), హార్దిక్, జడేజా, కుల్‌దీప్ యాదవ్, షమి, వరుణ్ చక్రవర్తి
న్యూజిలాండ్ జట్టు: విల్ యంగ్, రచన్ రవీంద్ర, విలియమ్సన్, మిచెల్, లేథమ్(వికెట్ కీపర్), ఫిలిప్స్, బ్రాస్‌వెల్, శాంట్నర్(కెప్టెన్), జేమీసన్, హెన్రీ/డఫి, ఒరూర్క్.