India Vs Bangladesh Head To Head ICC Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా బంగ్లాదేశ్‌తో భారత్ తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు దుబాయ్ వేదికగా జరగనుంది. ఇరు జట్ల బలబలాలు చూస్తే.. బంగ్లాదేశ్ కంటే భారత్ బలంగా కనిపిస్తోంది. ఇప్పటికే భారత్.. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన ఊపులో ఉంది. మరోవైపు రన్ మిషన్ విరాట్ కోహ్లీతో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ మంచి ఫామ్‌లో ఉన్నారు. అయితే బౌలింగ్‌లో భారత పేసర్ బుమ్రా లేని లోటు కనిపించే అవకాశం ఉంది. అలాగే బంగ్లాదేశ్ జట్టును కూడా తక్కువ అంచనా వేయలేదు. ఎందుకంటే.. ఆ జట్టు తమ పేస్ బౌలింగ్‌పై ఎక్కువగా ఆధారపడింది.
తుది జట్లు అంచనా..
భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, కుల్ దీప్ యాదవ్, మహ్మద్ షమి, అర్ష్ దీప్ సింగ్.
బంగ్లాదేశ్: నజ్ముల్ శాంటో(కెప్టెన్), తంజిద్, సర్కార్, హృదాయ్, ముష్ఫికర్, మహ్మదుల్లా, మిరాజ్, రిషాద్, తస్కిన్, ముస్తాఫిజుర్, నహిద్ రాణా.