India vs Australia 4th Test: బాక్సింగ్‌ డే టెస్టు.. దూకుడుగా ఆడుతున్న ఆసీస్.. స్కోరు ఎంతంటే?

India Vs Australia Boxing Day Test: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మెల్ బోర్న్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో టెస్ట్ ప్రారంభమైంది. బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లుగా సామ్ కాన్ స్టాప్, ఖవాజా క్రీజులోకి వచ్చారు. అయితే ఈ మ్యాచ్‌లో భారత్ ఒక్క మార్పుతో బరిలో దిగింది. గిల్ స్థానంలో వాషింగ్టన్ సుందర్ జట్టులోకి చేరాడు. ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇప్పటికే మూడు మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ఇందులో చెరొక విజయం సాధించాయి. మూడో టెస్ట్ వర్షం కారణంగా డ్రాగా ముగిసింది.

నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌‌లో తొలి సెషన్‌లో ఆస్ట్రేలియా దూకుడుగా ఆడింది. లంచ్ బ్రేక్ సమయానికి వికెట్ నష్టానికి 112 పరుగులు చేసింది. ఖవాజా(38), లబుషేన్(12) పరుగులు చేశారు. అంతకుముందు దూకుడుగా ఆడుతున్న ఓపెనర్ సామ్ కాన్ స్టాప్ (60) పరుగులు వద్ద జడేజా బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. ఆసీస్ 89 పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయింది. కాగా, మొదటి మ్యాచ్‌లోనే కాన్ స్టాప్ హాఫ్ సెంచరీ చేశాడు.

భారత్‌: జైస్వాల్‌, రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌, విరాట్‌ కోహ్లీ, రిషబ్‌ పంత్‌, రవీంద్ర జడేజా, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, వాషింగ్టన్‌ సుందర్‌, జస్ప్రిత్‌ బుమ్రా, సిరాజ్‌, ఆకాశ్‌ దీప్‌
ఆస్ట్రేలియా జట్టు: ఉస్మాన్‌ ఖవాజా, సామ్‌ కాన్‌స్టాస్‌, లబుషేన్‌, స్టీవెన్‌ స్మిత్‌, ట్రావిస్‌ హెడ్‌, మిచెల్‌మార్ష్‌, అలెక్స్‌ కేరీ, ప్యాట్‌ కమిన్స్‌, మిచెల్‌ స్టార్క్‌, నాథన్‌ లయన్‌, స్కాట్‌ బొలాండ్‌