Site icon Prime9

India vs Australia: టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న టీమిండియా.. నాలుగు వికెట్లు డౌన్

India vs Australia 5th Test Day 1 india three wickets loss: బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆ,స్ట్రేలియా భారత్ ఐదు మ్యాచ్‌ల టెస్ట్ టోర్నీ ఆడుతోంది. ఇప్పటికే నాలుగు మ్యాచ్‌లు పూర్తవగా.. రెండు మ్యాచ్‌ల్లో ఆసీస్ గెలుపొందగా.. ఒక మ్యాచ్ మాత్రమే భారత్ విజయం సాధించింది. మరో మ్యాచ్ డ్రాగా ముగిసింది. అయితే ఇవాళ సిడ్నీ వేదికగా ఐదో టెస్టు ప్రారంభమైంది. తొలుత టాస్‌ గెలిచిన టీమిండియా బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఇక,ఈ టెస్టు మ్యాచ్‌కు రోహిత్‌ దూరమయ్యాడు. దీంతో ఈ మ్యాచ్‌కు బుమ్రా కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.

ఓపెనర్లుగా యశస్వీ జైస్వాల్, కేఎల్ రాహుల్ బరిలోకి దిగగా.. స్టార్క్ బౌలింగ్‌లో కేఎల్ రాహుల్(4) కొన్ స్టాస్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత బోలాండ్ బౌలింగ్‌లో వెబస్టర్‌కు జైస్వాల్ దొరికిపోయాడు. దీంతో భారత్ 17 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. స్వల్ప వ్యవధిలో రెండు వికెట్లను భారత్ కోల్పోయిన తర్వాత నిలకడగా గిల్, విరాట్ ఆడుతున్నాడు. ఈ సమయంలో లంచ్ బ్రేక్‌కు ముందు భారత్‌కు షాక్ తగిలింది. నిలకడగా ఆడుతున్న గిల్(20) నాథన్ లైయన్ బౌలింగ్‌లో స్లిప్‌లో క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు.

తొలి సెషన్ ముగిసేసరికి భారత్ 3 వికెట్ల నష్టానికి 57 పరుగులు చేసింది. అయితే లంచ్ తర్వాత విరాట్(17) ఔటయ్యాడు. బోలాండ బౌలింగ్ లో ఆఫ్ సైడ్ వేసిన బంతిని ఆడబోయి స్లిప్‌లో చిక్కాడు. దీంతో భారత్ 72 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయి కష్టాల్లో పడింది. ప్రస్తుతం రవీంద్ర జడేజా(3), పంత్(10) క్రీజులో ఉన్నారు.

భారత్: యశస్వీ జైస్వాల్‌, కేఎల్‌ రాహుల్‌, శుభ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లీ, రిషబ్‌ పంత్‌, నితీశ్‌ కుమార్‌రెడ్డి, రవీంద్ర జడేజా, వాషింగ్టన్‌ సుందర్, జస్ప్రిత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ.
ఆస్ట్రేలియా: ఉస్మాన్‌ ఖవాజా, సామ్‌ కొన్‌స్టాస్‌, లబుషేన్‌, ట్రావిస్‌ హెడ్‌, స్టీవెన్‌ స్మిత్‌, వెబ్‌స్టర్‌, అలెక్స్‌ గ్యారీ, మిచెల్‌ స్టార్క్‌,ప్యాట్‌ కమిన్స్‌, స్కాట్‌ బొలాండ్‌ నాథన్‌ లయన్‌.

Exit mobile version
Skip to toolbar