India vs Australia 2nd Test match Pat Cummins claims fifer as IND 175 all out: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియా, భారత్ జట్లు రెండో టెస్ట్ మ్యాచ్‌లో తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో భారత్ నిరాశపరిచింది. ఆస్ట్రేలియా బౌలర్ల మ్యాజిక్‌కు రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 175 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో భారత్‌కు 18 పరుగులు మాత్రమే లీడ్ లభించింది. తర్వాత 19 పరుగుల లక్ష్యఛేదనలో బ్యాటింగ్ చేపట్టిన ఆస్ట్రేలియా.. కేవలం 3.2 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా టార్గెట్‌ను పూర్తి చేసింది. దీంతో భారత్‌పై ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో భారీ విజయం సాధించింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో మెక్ స్వీనీ(10), ఖవాజా(9) పరుగులతో రాణించారు. అయితే ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఇరు జట్లు 1-1తో సమానమయ్యాయి. ఇక, మూడో టెస్ట్ డిసెంబర్ 14 నుంచి బ్రిస్బేన్ వేదికగా ప్రారంభం కానుంది.
అంతకుముందు, రెండో ఇన్నింగ్స్‌లో భారత్ బ్యాటర్లలో నితీశ్ కుమార్ రెడ్డి(42; 47 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్ ), రిషబ్ పంత్(28), గిల్ (28) పరుగులు చేయగా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. యశస్వి జైస్వాల్(24), కేఎల్ రాహుల్(7), కోహ్లీ(11), రోహిత్(6), అశ్విన్(7), హర్షిత్ రాణా(0), బుమ్రా(2), సిరాజ్(7) విఫలమయ్యారు. ఇక, ఆసీస్ బౌలర్లలో కమిన్స్ 5 వికెట్లు పడగొట్టగా.. మిచెల్ స్టార్క్ 2, బోలాండ్ 3 వికెట్లు తీశారు. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 180 పరుగులు చేయగా.. ఆస్ట్రేలియా 337 పరుగులు చేసింది.