Site icon Prime9

India vs Australia: టాస్ గెలిచిన భారత్.. తొలి బంతికే ఓపెనర్ జైస్వాల్ ఔట్

India vs Australia 2nd test match India score after 10 overs is 30/1: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో భారత్ రెండో టెస్ట్ మ్యాచ్‌ ఆడుతోంది. ఈ మ్యాచ్‌లో భాగంగా భారత కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు. అయితే భారత్ జట్టులో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. రోహిత్ శర్మతో పాటు శుభమన్ గిల్, అశ్విన్ జట్టులోకి వచ్చారు. ఓపెనర్లుగా యశస్వి జైస్వాల్చ కేఎల్ రాహుల్ బ్యాటింగ్ వచ్చారు. రోహిత్ శర్మ మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేయనున్నట్లు ఆయన స్వయంగా చెప్పారు.

ఆడిలైడ్ వేదికగా పింక్ బాల్ డే అండ్ నైట్ మ్యాచ్‌లో భాగంగా ప్రారంభమైన తొలి బంతికే భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఔట్ అయ్యారు. మిచెల్ స్టార్క్ వేసిన తొలి బంతికే రాహుల్‌తో కలిసి ఓపెనింగ్‌కు వచ్చిన యశస్వి జైస్వాల్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగారు. అంతకుముందు తొలి టెస్ట్ మ్యాచ్‌లో మొదటి ఇన్నింగ్స్‌లోనూ యశస్వి జైస్వాల్ డకౌట్‌ కాగా, తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో 161 పరుగుల భారీ ఇన్నింగ్స్ ఆడారు. ఇక, భారత్ 10 ఓవర్లు పూర్తయ్యేసరికి వికెట్ నష్టానికి 30 పరుగులు చేసింది. ప్రస్తుతం రాహుల్(9), గిల్(19) క్రీజులో ఉన్నారు.

తుది జట్లు
భారత్: యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (WC), రోహిత్ శర్మ (C), నితీష్ కుమార్ రెడ్డి, రవిచంద్రన్ అశ్విన్, హర్షిత్ రాణా, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.

ఆస్ట్రేలియా : ఉస్మాన్ ఖవాజా, నాథన్ మెక్‌స్వీనీ, మార్నస్ లాబుషేన్, స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ క్యారీ, ప్యాట్ కమిన్స్ (C), మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, స్కాట్ బోలాండ్.

Exit mobile version