Site icon Prime9

Boxing Day Test: బాక్సింగ్ డే టెస్టు.. లక్ష టికెట్లు హాట్ ‌కేకుల్లా..!

IND vs AUS Boxing Day Test tickets opening day sold out: భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న 5 టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆసక్తికరంగా సాగుతోంది. పెర్త్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత్, అడిలైడ్‌లో జరిగిన రెండవ టెస్ట్‌లో ఆసీస్ విజయం సాధించగా, డిసెంబరు 14న బ్రిస్బేన్ వేదికగా మూడో టెస్ట్‌ జరగనుంది. ఇక, 15 రోజుల తర్వాత.. డిసెంబరు 26న జరిగే బాక్సింగ్ డే టెస్టుకు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే స్పందన వచ్చింది.

లక్ష సీట్ల కెపాసిటీ గల మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో జ‌రిగే ఈ బాక్సింగ్ డే టెస్టుకు అనాదిగా ప్ర‌త్యేక క్రేజ్ ఉండటంతో తొలిరోజు మ్యాచ్‌కు సంబంధించి గంటల వ్యవధిలోనే లక్ష టికెట్లు అమ్ముడయ్యాయని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ప్రకటించింది. కాగా, అడిలైడ్ పింక్ బాల్ టెస్టుకు 3 రోజుల్లో 1.35 లక్షల మంది హాజరైన సంగతి తెలిసిందే.

Exit mobile version