Ind Vs Aus 3rd Test: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో (Border Gavaskar Trophy) భాగంగా జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా తొలి విజయం అందుకుంది. 9 వికెట్ల తేడాతో భారత్ పై ఘన విజయం సాధించింది.
టీమిండియా పెట్టిన 76 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది.
అద్భుతాలు ఏమైనా జరిగి భారత స్పిన్నర్లు ఏమైనా మాయ చేస్తారనుకున్న అభిమానుల ఆశలకు నిరాశే మిగిలింది.
దీంతో నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా 2-1 ఆధిక్యంలో భారత్ కొనసాగుతోంది. అహ్మదాబాద్ వేదికగా చివరి టెస్టు మార్చి 9 న ప్రారంభం కానుంది.
తొలి ఓవర్ లోనే షాక్ తగిలినా..(Ind Vs Aus 3rd Test)
అంతకుముందు భారత్ పెట్టిన 79 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ కు మొదటి ఓవర్ లోనే రవిచంద్రన్ అశ్విన్ రూపంలో షాక్ తగలింది.
రెండో బంతికి జట్టులో కీలకమైన ఉస్మాన్ ఖవాజా(0) ను పెవిలియన్ చేరాడు.
అయితే , ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన లబుషేన్ (28, నాటౌట్) తో కలిసి మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్ (49, నాటౌట్) మ్యాచ్ ను పూర్తి చేశారు.
ప్రారంభంలో ఈ జోడి నెమ్మందించినా.. క్రమంగా దూకుడు పెంచి భారత బౌలర్లపై ఒత్తిడి తీసుకొచ్చారు.
అయితే భారత స్పిన్నర్స్ ఎంత కట్టుదిట్టంగా బౌలింగ్ చేసినా లక్ష్యం చిన్నది కావడంతో ఆసీస్ కు తేలిక అయింది.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన భారత్ తొలి ఇన్నింగ్స్ లో 109 పరుగులకే ( 33.2 ఓవర్లలో) ఆలౌట్ అయింది.
ఆసీస్ తన తొలి ఇన్నింగ్స్ లో 76.3 ఓవర్లలో 197 పరుగులకు ఆలౌటైంది.
ఆసీస్ బ్యాటర్ ఖవాజా చేసిన 60 రన్స్ తో ఆ మాత్రం స్కోరు వచ్చింది. భారత బౌలర్లలో జడ్డూ తన స్పిన్ మాయతో 4 వికెట్లు తీసుకోగా.. అశ్విన్ 3, ఉమేష్ 3 వికెట్లు తీసుకున్నారు.
తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 87 పరుగుల ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా 163 పరుగులకే కుప్పకూలింది.
ఆసీస్ బౌలర్లు విజృంభించి.. భారత బ్యాటింగ్ ఆర్డర్ ను కోలుకోలేని దెబ్బ కొట్టారు.
ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియోన్ ఏకంగా 8 వికెట్లు తీసి భారత బ్యాటర్లను పెవిలియన్ కు పంపించాడు. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 60.3 ఓవర్లలో 160 పరుగులకు ఆలౌట్ అయింది.
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా లియోన్
ఏకంగా 8 వికెట్లు తీసి టీమ్‌ఇండియాను దెబ్బకొట్టిన ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియోన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు(Ind Vs Aus 3rd Test) ను సొంతం చేసుకున్నాడు.
భారత స్పిన్నర్లు మాత్రం ఆసీస్ బ్యాటర్లపై ఆధిక్యం సాధించలేక పోయారు.
రెండో ఇన్నింగ్స్‌లో తొలి వికెట్ నష్టపోయిన ఆసీస్ బ్యాటర్లు భారత్ బౌలర్లపై ఎటాకింగ్ కు దిగారు.
దీంతో జడేజా, అశ్విన్ వారికి అడ్డుకట్ట వేయలేక పోయారు. భారత్ తన రెండు ఇన్నింగ్స్‌ల్లో 18 వికెట్లను ఆసీస్ స్పిన్నర్లకే సమర్పించగా..
టీమ్‌ఇండియా స్పిన్నర్లు మాత్రం కేవలం 8 వికెట్లను మాత్రమే తీశారు.
ఇప్పటి వరకు జరిగిన మూడు టెస్టుల్లో మూడు రోజుల్లోపే ముగియడం గమనార్హం.
బెర్తు ఖాయం చేసుకున్న ఆసీస్
భారత్ తో జరిగిన మూడో టెస్టులో విజయం సాధించిన ఆస్ట్రేలియా.. ప్రపంచ టెస్టు ఛాంపియన్ ఫైనల్ కు దూసుకెళ్లింది వరుసగా రెండు టెస్టుల్లో ఓడినప్పటికీ ..
మూడో టెస్టులో విజయంతో డబ్ల్యూటీసీ ఫైనల్ కు ఆసీస్ చేరింది.
ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయంట్ల పట్టికలో 68.52 శాతంతో ఆస్ట్రేలియా టాప్ లో ఉంది. ఈ తర్వాతి స్థానంలో 60.29 శాతంతో టీమిండియా ఉంది.
అయితే శ్రీలంక (5333) , సౌతాఫ్రికా (52.38) లు భారత్ కు పోటీ ఇస్తున్నాయి.
కానీ మార్చి 9 న జరిగే నాల్గో టెస్టులో భారత్ విజయం సాధిస్తే ఎలాంటి సమీకరణాలు లేకుండా భారత్ ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంటుంది.