Site icon Prime9

ICC ODI Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత్ హవా.. టాప్ 10లో ఏకంగా నలుగురు ప్లేయర్లు

ICC ODI Rankings Shubman Gill, Rohith sharma and Virat Kohli top ten: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ ప్రకటించింది. ఈ ఫార్మాట్‌లో భారత స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ప్రపంచ వన్డే ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. తాజాగా, ఐసీసీ విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో భారత్ క్రికెటర్ల హవా కొనసాగుతోంది. టాప్ 10 ర్యాంకింగ్స్‌లో భారత్ నుంచి నలుగురు ఉన్నారు. గిల్‌తో పాటు భారత కెప్టెన్ రోహిత్ శర్మ 3వ స్థానం, స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ 5వ స్థానం, శ్రేయస్ అయ్యర్ 9వ స్థానాల్లో ఉన్నారు. బౌలర్ల విషయానికొస్తే.. కుల్ దీప్ యాదవ్ 3వ స్థానంలో ఉండగా.. ఆల్ రౌండర్ల విభాగంలో రవీంద్ర జడేజా 9వ ర్యాంకు సాధించాడు.

భారత వైస్ కెప్టెన్, ఓపెనర్ శుభ్ మన్ గిల్ 817 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా… భారత కెప్టెన్ రోహిత్ శర్మ 747 పాయింట్లతో మూడో స్థానం, ఛాంపియన్స్ ట్రోఫీలో పాక్‌పై సెంచరీ చేయడంతో విరాట్ కోహ్లి 743 పాయింట్లతో ఓ స్థానా న్ని మెరుగుపర్చుకుని ఐదో స్థానానికి చేరాడు. ఇక ఇటీవలి కాలంలో భారత మిడిలార్డర్‌లో అద్భుతంగా రాణిస్తున్న శ్రేయస్ అయ్యర్ 679 పాయింట్లతో 9వ స్థానంలో నిలిచాడు. టాప్ 10లో భారత బ్యాటర్లతో పాటు బాబర్ ఆజమ్ 2 వ స్థానం, హెన్రిచ్ క్లాసెన్ 4 వ స్థానం, డారిల్ మిచెల్ 6, హ్యారీ టెక్టార్ 7, చరిత్ అసలంక 8, షాయ్ హోప్ 10వ స్థానంలో ఉన్నారు.

బౌలర్ల ర్యాంకింగ్స్‌లో శ్రీలంక స్పిన్నర్ మహీశ్ తీక్షణ నంబర్ వన్ స్థానంలో ఉండగా.. రషీద్ ఖాన్ రెండో స్థానంలో ఉన్నాడు. భారత్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 3వ స్థానంలో ఉన్నారు. వన్డే టీమ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా(120) రేటింగ్ పాయింట్లతో టాప్ ప్లేస్‌లో కొనసాగుతోంది. ఆసీస్(110) రేటింగ్ పాయింట్లతో రెండో స్థానం, పాకిస్తాన్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, శ్రీలంక, ఇంగ్లండ్, ఆఫ్ఘానిస్తాన్, బంగ్లాదే శ్, వెస్టిండీస్ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

Exit mobile version
Skip to toolbar