Site icon Prime9

Urvil Patel: ఉర్విల్ పటేల్ కొత్త రికార్డ్

Gujarat’s Urvil Patel smashes second-fastest T20 century: గుజ‌రాత్ వికెట్ కీప‌ర్ ఉర్విల్ పటేల్‌.. టీ20ల్లో కొత్త రికార్డు క్రియేట్ చేశాడు. స‌య్య‌ద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అత్యంత వేగమైన సెంచ‌రీ కొట్టి వార్తల్లో నిలిచాడు. త్రిపుర‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఉర్విల్ 28 బంతుల్లోనే సెంచ‌రీ పూర్తి చేసి, ఏ-లిస్టు క్రికెట్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టిన ఆటగాడిగా రికార్డు నెల‌కొల్పటమే గాక టీ20ల్లో అత్యంత వేగంగా సెంచ‌రీ చేసిన భార‌త క్రికెట‌ర్లలో రెండ‌వ క్రికెటర్‌గా నిలిచాడు.

2018లో స‌య్య‌ద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో రిష‌బ్ పంత్ దేశ‌వాళీ టీ20 క్రికెట్‌లో ఫాస్ట్‌గా సెంచ‌రీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్ప‌టి వ‌ర‌కు టీ20 క్రికెట్‌లో ఫాస్టెస్ట్ సెంచ‌రీ 27 బంతుల్లో న‌మోదు అయ్యింది. ఇస్టోనియాకు చెందిన సాహిల్ చౌహాన్‌.. 27 బంతుల్లో సైప్ర‌స్‌పై స్కోర్ చేయగా, తాజాగా ఉర్విల్ ఆ రికార్డును బ్రేక్ చేశాడు. అయితే, ఇంత మంచి బ్యాట్స్‌మన్‌ను తాజా ఐపీఎల్‌లో ఏ టీమ్‌ కొనేందుకు ఆసక్తి చూపకపోవటం విశేషం.

Exit mobile version