Site icon Prime9

Grandmaster Koneru Humpy: ప్రపంచ మహిళా విజేతగా కోనేరు హంపీ

Grandmaster Koneru Humpy World Rapid Chess Champion: న్యూయార్క్ వాల్ స్ట్రీట్‌లో జరిగిన ఫిడే వరల్డ్ ర్యాపిడ్ ఛాంపియన్‌షిప్-2024, బ్లిట్జ్‌ చెస్ ఛాంపియన్‌షిప్‌ మహిళల విభాగంలో భారత ప్లేయర్ కోనేరు హంపీ విజేతగా అవతరించి కొత్త చరిత్ర సృష్టించింది. ఈ టోర్నీలో 8.5 పాయింట్లతో తొలిస్థానం కైవశం చేసుకున్న హంపి, 2019లోనూ ఛాంపియన్‌‌గా నిలిచింది. చైనా గ్రాండ్‌మాస్టర్ జు వెంజున్ తర్వాత ఒకటి కంటే ఎక్కువసార్లు విజేతగా నిలిచిన ప్లేయర్‌గా తాజా విజయంతో హంపి ఘనత సాధించింది.

ఇదిలా ఉండగా, ఈ పోటీల్లో ద్రోణవల్లి హారిక ఐదోస్థానం కైవసం చేసుకుంది. మరోవైపు, పురుషుల ర్యాపిడ్‌ ఈవెంట్‌లో పదికి గానూ తొమ్మిది రౌండ్ల వరకు తొలిస్థానంలో నిలిచిన భారత గ్రాండ్‌మాస్టర్‌ అర్జున్ ఇరిగేశి.. చివరిలో తడబడటంతో, 9 పాయింట్లతో ఐదో స్థానానికి పరిమితం కాగా, రష్యాకు చెందిన 18 ఏళ్ల వోలాదర్ ముర్జిన్‌ విజేతగా నిలిచాడు. కాగా, అసమానమైన పట్టుదల, సంకల్పం, నైపుణ్యం గల హంపి రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు అందుకోవాలని సీఎం చంద్రబాబు అకాంక్షించారు.

Exit mobile version