Team India players: తిరువనంతపురం వేదికగా శ్రీలంకతో భారత్ మూడ్ వన్డే ఆడనుంది. ఇప్పటికే సిరీస్ ను లాక్ చేసిన టీంఇండియా(Team India players) మూడే వన్డే కూడా గెలిచి వన్డే సిరీస్ క్లీన్ స్వీప్ పై కన్నేసింది.
అయితే కనీసం మూడో వన్డే అయినా గెలిచి పరువు నిలుపుకోవాలని చూస్తోంది శ్రీలంక. ఆదివారం జరుగనున్న వన్డే కోసం ఇరు జట్టు ఇప్పటికే తిరువనంతపురం చేరుకుని ప్రాక్టీస్ మొదలు పెట్టాయి.
ఈ క్రమంలో కొంతమంది టీంఇండియా ఆటగాళ్లు తిరువనంతపురంలోని ప్రసిద్ధ పద్మనాభస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. సంప్రదాయ దుస్తుల్లో ఆలయానికి వెళ్లి స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు.
సూర్య కుమార్ యాదవ్, శ్రేయర్ అయ్యర్, అక్షర్ పటేల్, కులదీప్ యాదవ్, యజువేంద్ర చాహల్ లు ఆలయాన్ని సందర్శించిన వారిలో ఉన్నారు.
సంప్రదాయ పంచెకట్టుతో ఉన్న వారి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇక నామమాత్రపు మూడే వన్డే కోసం జట్టులో కొన్ని మార్పులు చేయనున్నట్టు సమాచారం. తొలి రెండు వన్డేలకు దూరమైన సూర్యకూమార్ యాదవ్, ఇషాన్ కిషన్ ఆఖరి వన్డేకు జట్టులోకి రానున్నట్టు సమాచారం.
ఇకపోతే, జనవరి 18వ తేదీ నుంచి టీమిండియా న్యూజిల్యాండ్ తో తలపడనుంది. ఈ మ్యాచ్ లు హైదరాబాద్ వేదికగా ఉప్పల్ స్టేడియంలో జరుగనున్నాయి.
ఈ మ్యాచ్ కు సంబంధించిన టిక్కెట్లను ఇప్పటికే ఆన్ లైన్ లో విక్రయిస్తున్నారు.
భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), హార్డిక్ పాండ్యా, అక్షర్ పటేల్, ఉమ్రాన్ మాలిక్, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ,
శ్రీలంక: అవిష్క ఫెర్నాండో, నువానిడు ఫెర్నాండ్, చరిత్ అసలంక, దుసున్ శనక(కెప్టెన్), కుశాల్ మెండిస్(వికెట్ కీపర్), ధనంజయ డిసిల్వా, చమిక కరుణరత్నే, వానిందు హసరంగా, కసున్ రజిత, లాహిరు కుమార, దునిత్ వెలాలెజ్.
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/