Jasprit Bumrah: టీమ్ ఇండియాకు భారీ షాక్‌! శ్రీలంకతో వన్డే సిరీస్‌కు బుమ్రా దూరం

Jasprit Bumrah:శ్రీలంకపై టీ20 సిరీస్‌ను నెగ్గిన టీమ్‌ఇండియా జనవరి 10 నుంచి ఆ దేశంతో మూడు వన్డేల సిరీస్‌ ఆడనుంది. అయితే ఈ సిరీస్‌కు ముందు భారత్‌కు భారీ షాక్‌ తగిలింది. టీమ్‌ఇండియా పేస్ బౌలర్ జస్ప్రీత్‌ బుమ్రా (Jasprit Bumrah) దూరం అయ్యాడు. పూర్తిస్థాయి ఫిట్‌నెస్ సాధించకపోవడంతో అతడిని ఈ సిరీస్‌ నుంచి తప్పించినట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. దీంతో శ్రీలంకతో వన్డే సిరీస్‌కి ముందు భారత్‌కు చేదు అనుభవం ఎదురైంది.

బుమ్రా ఎందుకు దూరమయ్యాడు?

బుమ్రా చివరిసారిగా సెప్టెంబర్ లో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 మ్యాచ్‌లోఆడాడు. అప్పటి నుంచి బుమ్రా (Jasprit Bumrah) వెన్ను గాయంతో బాధపడుతున్నాడు. ఏ ఫార్మాట్‌లోనూ ఆడలేదు. టీ20 ప్రపంచ కప్‌లోనూ చోటు కోల్పోయాడు.

శ్రీలంకతో జరిగే వన్డే సిరీస్ లో బుమ్రా (Jasprit Bumrah) బరిలోకి దిగుతాడని అందరు భావించారు. అయితే వెన్ను గాయం నుండి పూర్తిగా కోలుకోలేకపోయినందున అతడిని సిరీస్ నుంచి తప్పించినట్లు తెలుస్తోంది. ఇక జనవరి 18 నుంచి న్యూజిలాండ్‌తో జరిగే సిరీస్‌కు.. అలాగే ఫిబ్రవరి 9 నుండి ప్రారంభమయ్యే నాలుగు టెస్టుల బోర్డర్-గవాస్కర్ సిరీస్‌కు బుమ్రా అందుబాటులో ఉంటాడా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.

ఈ ఏడాది అక్టోబర్-నవంబర్‌లో వన్డే ప్రపంచకప్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వనున్న నేపథ్యంలో బుమ్రాను చివరి నిమిషంలో తప్పించడం.. చర్చనీయంశంగా మారింది.

ఇక శ్రీలంకతో జరిగే మూడు వన్డేల సిరీస్‌కు భారత జట్టు ఇలా ఉండనుంది. రోహిత్‌ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్‌ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్‌, శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్ రాహుల్, ఇషాన్‌ కిషన్‌, హార్దిక్ పాండ్య (వైస్‌ కెప్టెన్), వాషింగ్టన్‌ సుందర్‌,చాహల్, కుల్దీప్‌ యాదవ్‌, అక్షర్‌ పటేల్, షమి, సిరాజ్‌, ఉమ్రాన్‌ మాలిక్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌.

 

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: http://Twitter: https://twitter.com/prime9news

ఇవి కూడా చదవండి

Sania Mirza: టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా రిటైర్మెంట్.. అదే చివరి టోర్నీ అంటూ క్లారిటీ

INDIA vs SRILANKA : టీమ్ ఇండియా కొంపముంచిన అర్ష్‌దీప్ సింగ్… 5 నో బాల్స్, 37 రన్స్ ?

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital