Prime9

Kuldeep Yadav : ఘనంగా క్రికెటర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ నిశ్చితార్థం

Indian spinner Kuldeep Yadav : భారత స్పిన్నర్ కుల్‌దీప్‌ యాదవ్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన చిన్ననాటి స్నేహితురాలు వంశికను పెళ్లి చేసుకోబోతున్నాడు. బుధవారం వీరి ఎంగేజ్‌మెంట్ వైభవంగా జరిగింది. లఖ్నోలో నిశ్చితార్థ జరిగింది. ఈ వేడుకలో స్నేహితులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. వారి సమక్షంలో కాబోయే కొత్త జంట ఉంగరాలు మార్చుకుంది. వీరి పెళ్లి త్వరలోనే జరగనున్నట్లు తెలుస్తోంది.

 

ఇద్దరు చిన్ననాటి స్నేహితులు..
కుల్‌దీప్‌, వంశిక చిన్ననాటి స్నేహితులు. వీరి స్నేహం కాస్తా ప్రేమగా మారడంతో రెండు కుటుంబ పెద్దలు అంగీకారంతో వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారు. దీంతో వీరి నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. త్వరలో వీరి పెళ్లి కూడా జరగనుంది. వంశిక ప్రస్తుతం ఎల్‌ఐసీలో పనిచేస్తున్నట్లు తెలిసింది. వీరి ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి. మరోవైపు త్వరలో ఇంగ్లాండ్‌తో జరగనున్న ఐదు టెస్టుల సిరీస్‌కు కుల్‌దీప్‌ ఎంపికైన విషయం తెలిసిందే.

Exit mobile version
Skip to toolbar