Prime9

Sreesanth: నోరు జారిన శ్రీశాంత్.. మూడేళ్లు సస్పెన్షన్ వేటు

Cricket: టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్ పై కేరళ క్రికెట్ అసోసియేషన్ వేటు వేసింది. రాష్ట్ర క్రికెట్ కార్యకలాపాల్లో పాల్గొనకుండా ఆయనపై మూడేళ్లపాటు సస్పెండ్ చేస్తూ చర్యలు తీసుకుంది. కాగా సంజూ శాంసన్ విషయంలో రాష్ట్ర అసోసియేషన్ వ్యతిరేకంగా మాట్లాడటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. అయితే ఏప్రిల్ 30నే చర్యలు తీసుకోగా విషయంగా కాస్త ఆలస్యంగా బయటకు వచ్చింది.

కాగా ఛాంపియన్స్ ట్రోఫీకి సెలక్ట్ అయిన ప్లేయర్లలో సంజూ శాంసన్ లేరు. అయితే సంజూకు టీమ్ లో చోటు దక్కకపోవడానికి కేరళ క్రికెట్ అసోసియేషన్ పాత్ర ఉందని శ్రీశాంత్ ఆరోపణలు చేశాడు. శ్రీశాంత్ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న కేసీఏ ఆయనకు నోటీసులు ఇచ్చింది. అందుకు శ్రీశాంత్ ఇచ్చిన సమాధానంపై అసంతృప్తితో ఆయనపై వేటు వేసింది. కాగా కేరళ క్రికెట్ లీగ్ లోని కొల్లం ఏరీస్ ఫ్రాంచైజీకి శ్రీశాంత్ సహ యజమానిగా ఉన్నాడు.

అయితే శ్రీశాంత్ వివాదంలోకి ఎక్కడం ఇదేమీ కొత్త కాదు. గతంలోనూ ఆయనపై చర్యలు తీసుకున్న దాఖలాలు ఉన్నాయి. 2013లో ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా రాజస్థాన్ రాయల్స్ టీమ్ తరపున మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడ్డారని ఆయనపై జీవితకాలం నిషేధం విధించారు.

Exit mobile version
Skip to toolbar