Prime9

India Vs New Zealand: హైదరాబాద్‌ క్రికెట్‌ అభిమానులకు తీపి కబురు.. ఉప్పల్‌లో భారత్‌, కివీస్‌ టీ20 మ్యాచ్‌!

India vs New Zealand T20 match in Uppal: హైదరాబాద్‌ క్రికెట్‌ అభిమానులకు బీసీసీఐ తీపి కబురు చెప్పింది. నగరంలోని ఉప్పల్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ క్రికెట్‌ మైదానం మరో ధనాధన్‌ పోరుకు ఆతిథ్యం ఇవ్వనుంది. వచ్చే ఏడాది జనవరిలో భారత పర్యటనకు రానున్న న్యూజిలాండ్‌తో భారత జట్టు ఒక టీ20 మ్యాచ్‌ ఆడనుంది. మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడేందుకు కివీస్‌ జట్టు జనవరిలో భారత్‌కు రానుంది.

 

హైదరాబాద్‌తోపాటు జైపూర్‌, మొహాలి, ఇండోర్‌, రాజ్‌కోట్‌, గువహతి, త్రివేండ్రం, నాగ్‌పూర్‌ వేదికలను బీసీసీఐ ఖరారు చేసినట్లు సమాచారం. శనివారం జరగబోయే బీసీసీఐ అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం తర్వాత ఇందుకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ వెలువడనుంది. ఉప్పల్‌ స్టేడియంలో చివరిసారిగా టీమ్ ఇండియా గతేడాది అక్టోబర్‌లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌ ఆడింది. పొట్టి క్రికెట్‌లో భారత్ తమ అత్యధిక పరుగుల రికార్డు (297/6)ను నమోదు చేసింది.

 

Exit mobile version
Skip to toolbar