Prime9

Team India : విమాన ప్రమాద మృతులకు భారత జట్టు నివాళి

BCCI : అహ్మదాబాద్‌ నుంచి లండన్‌ బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్‌ 787-8 డ్రీమ్‌లైనర్‌ విమానం గురువారం ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో 265 మంది ప్రయాణికులు మృతిచెందారు. మృతులకు భారత జట్టు ఆటగాళ్లు నివాళులర్పించారు.

 

టీమ్ ఇండియా ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్లింది. ఈ నెల 20వ తేదీ నుంచి ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ ఆడనుంది. ఇందులో భాగంగా శుక్రవారం బెకెన్‌హామ్‌లో ఇంట్రా స్వ్కాడ్‌ మ్యాచ్‌ ఆడుతోంది. మ్యాచ్‌కు ముందు భారత జట్టు ఆటగాళ్లు, సహాయక సిబ్బంది విమాన ప్రమాదంలో మృతిచెందిన ప్రయాణికులకు నివాళులర్పించారు. అనంతరం చేతికి నల్లటి బ్యాండ్‌లు ధరించి మ్యాచ్‌లో పాల్గొన్నారు. ఈ మేరకు చిత్రాలను బీసీసీఐ తన ఎక్స్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది.

 

Exit mobile version
Skip to toolbar