Site icon Prime9

Gautam Gambhir : జడేజా విలువ మాకు తెలుసు.. అతను ఇండియాకు ఎంతో కీలకం : గంభీర్‌

Gautam Gambhir

Gautam Gambhir : ఇండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాపై హెడ్‌ కోచ్ గౌతమ్ గంభీర్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. అతడిని తక్కువ అంచనా వేస్తున్నారని, జడేజా ప్రపంచంలోని అత్యుత్తమ ఆల్‌రౌండర్లలో ఒకరని కొనియాడారు. రవీంద్ర విలువ ఇండియా డ్రెస్సింగ్ రూమ్‌కు తెలుసని గౌతమ్ పేర్కొన్నాడు. జడేజా గురించి మనం ఎప్పుడూ మాట్లాడమని తాను అనుకుంటున్నానని చెప్పారు. అతడు మూడు ఫార్మాట్లలో ఇండియాకు ఎంతో సేవ చేశారని పేర్కొన్నాడు. రవీంద్ర జడేజా ఇండియా క్రికెట్‌కు ఎంతో కీలకమన్నారు. బ్యాటర్‌గా, బౌలర్‌గా మాత్రమే కాదని, ఫీల్డర్‌ లోనూ అదరగొడుతున్నారని కొనియాడారు. ఇప్పుడు ప్రపంచంలోని టాప్ ఆల్‌రౌండర్లలో జడేజా ఒకడని చెప్పుకొచ్చారు. అతని విలువ డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న తమకు మాత్రమే తెలుసు అన్నారు. రవీంద్ర డ్రెస్సింగ్ రూమ్‌లో ఉండటం ఎంత ముఖ్యమో తమకు తెలుసు అని వివరించాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో అతడు అదరగొడుతున్నాడని, మిడిల్ ఓవర్లలో కీలకంగా మారుతున్నాడన్నారు. ఎక్కువగా వికెట్లు పడగొట్టకున్నా పరుగులు కట్టడి చేస్తున్నాడని, ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌ల్లో 4.78 ఎకానమీతో నాలుగు వికెట్లు పడగొట్టాడని గుర్తుచేశారు.

ఎవరెన్నీ చెప్పినా పట్టించుకోం..
ఆల్‌రౌండర్‌ అక్షర్ పటేల్‌‌ను కొన్ని మ్యాచ్‌లుగా 5 స్థానంలో ఆడిస్తున్నారు. అతడు కీలకమైన పరుగులు చేస్తూ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నారు. అక్షర్‌ను 5 స్థానంలో పంపడాన్ని కొంతమంది మాజీ క్రికెటర్లు తప్పుబడుతున్నారు. దీనిపై గౌతమ్ గంభీర్ స్పందించారు. ఎవరెన్నీ చెప్పినా తాము పట్టించుకోమని ఇంతకు ముందే సమాధానం ఇచ్చినట్లు తెలిపారు. అక్షర్ పటేల్ మంచి ఆటగాడు అన్నారు. అక్షర్‌ పటేల్‌లో ఉన్న సత్తా తమకు తెలుసు అన్నారు. అతడిని 5 స్థానంలోనే కొనసాగిస్తామన్నారు. కేఎల్‌ రాహుల్‌‌ను 6 స్థానంలో పంపడంపై కూడా గంభీర్ మాట్లాడాడు. ఏ స్థానంలో ఆడుతున్నామనేది ముఖ్యం కాదని, ఏ మేరకు ప్రభావం చూపతున్నామనేది ముఖ్యమన్నాడు. తుది జట్టులో ఉండటం గురించి మాత్రమే ఆలోచించాలని, జట్టు అవసరాలకు తగ్గట్టుగా నడుచుకోవాలని, రాహుల్ ఆ పనిని చాలా సంతోషంగా చేస్తున్నాడని గంభీర్ అన్నాడు.

Exit mobile version
Skip to toolbar