Site icon Prime9

Australia: ఆస్ట్రేలియా జట్టుకు గుడ్ న్యూస్.. విధ్వంసకర వీరుడు వచ్చేస్తున్నాడు?

australia

australia

Australia: ఆస్ట్రేలియా జట్టుకు గుడ్ న్యూస్ అందింది. ఇప్పటికే బోర్డర్ గవాస్కర్ ట్రోఫిలో రెండు ఓటములతో కొట్టుమిట్టాడుతున్న ఆ జట్టుకు శుభవార్త అందింది. ఆసీస్ విధ్వంసకర ఆల్‌రౌండర్‌ కామెరాన్ గ్రీన్ ఆ జట్టులోకి రానున్నట్లు తెలుస్తోంది. భారత్ తో జరిగే మూడో టెస్టుకు.. అందుబాటులో ఉండనున్నట్లు ఆసీస్ క్రికెట్ వర్గాలు తెలిపాయి.

మూడో టెస్టుకు అందుబాటులో గ్రీన్.. (Australia)

భారత్ లో జరుగుతున్న బోర్డర్- గవాస్కర్ ట్రోఫిలో తొలి రెండు టెస్టుల్లో ఆసీస్ ఘోర పరభావాలను మూట గట్టుకుంది. ఈ రెండు మ్యాచుల్లో కంగారు జట్టు.. ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. ఓ వైపు గాయాల బెడదతో ఇప్పటికే సతమతమవుతున్న ఆ జట్టు.. మూడో టెస్టుకు సిద్ధం అవుతుంది. ఇక ఈ మ్యాచ్ లో అయినా గెలిచి.. ప్రతికారం తీర్చుకోవాలని ఆసీస్ భావిస్తోంది. ఇక ఈ మ్యాచ్ ఓడిపోతే.. భారత్ సిరీస్ ను కైవసం చేసుకుంటుంది. గాయాల బెడదతో ఆసీస్ ఆటగాళ్లు దూరం అవుతున్న వేళ.. ఆ జట్టు ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్ టీమ్ లోని రానున్నాడు. దీంతో ఆసీస్ బ్యాటింగ్ లైనప్ బలపడనుంది. గ్రీన్ అటు బ్యాటింగ్ లోను.. ఇటు బౌలింగ్ లోను రాణించగలడు.

ఆసీస్‌కు గాయాల బెడద..

ఈ సిరీస్ లో ఆసీస్ ను గాయాల బెడద వెంటాడుతోంది. ఇప్పటికే మిగతా టెస్టులకు డేవిడ్‌ వార్నర్‌, జోష్‌ హాజిల్‌వుడ్‌ దూరం అయ్యారు. ఆ తర్వాత.. ఆ జట్టు మరో కీలక ఆటగాడు కమిన్స్ వ్యక్తిగత కారణాలతో స్వదేశానికి వెళ్లాడు. దీంతో ఆసీస్ పలు మార్పులతో మూడో టెస్టు ఆడనుంది. మిగిలిన రెండు టెస్టులకు.. స్టీవ్‌ స్మిత్‌ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. తొలి రెండు టెస్టులకు దూరమైన కీలక ఆటగాళ్లు.. మిచెల్‌ స్టార్క్‌.. కామెరాన్ గ్రీన్ మూడో టెస్టుకు అందుబాటులో ఉండనున్నారు. ప్రస్తుతం వీరు పూర్తి ఫిట్‌నెస్‌ సాధించినట్లు కంగారు జట్టు కోచ్ తెలిపాడు. వీరు బెంగళూరులో ఏర్పాటు చేసిన స్పెషల్‌ ట్రైనింగ్‌ క్యాంప్‌లో ప్రాక్టీస్‌ చేశారు.

గతేడాది భారత్‌ లో జరిగిన మ్యాచుల్లో గ్రీన్‌ అద్భుతంగా రాణించాడు. ఇతడు ఐపీఎల్‌ మినీ వేలంలో ఏకంగా 17 కోట్ల ధర పలికాడు. ఇతడిని ముంబై ఇండియన్స్‌ ​కొనుగోలు చేసింది. ఇక మూడో టెస్టు ఇండోర్‌ వేదికగా మార్చి 1 నుంచి ప్రారంభం కానుంది. అయితే మార్చి 17 నుంచి ప్రారంభం కానున్న 3 వన్టేల సిరీస్ కు వార్నర్ అందుబాటులో ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నాలుగు టెస్టుల సిరీస్ లో రెండు టెస్టు మ్యాచుల్లో మూడు ఇన్నింగ్స్ లు ఆడిన వార్నర్ కేవలం 26 పరుగులే చేశాడు. ఢిల్లీ వేదికగా జరిగిన రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో వార్నర్ కంకషన్‌కు గురయ్యాడు. ఆ తర్వాత ఎడమ చేతికి బంతి బలంగా తాకింది. అయినా, బ్యాటింగ్‌ కొసాగించిన వార్నర్‌ 15 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో వార్నర్ స్థానంలో రెన్‌షా కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చాడు.

Exit mobile version