Prime9

Women’s ODI World Cup : సెప్టెంబర్‌ 30 నుంచి మహిళల వన్డే ప్రపంచకప్‌.. టైటిల్‌ ఫెవరేట్‌గా బరిలో భారత్‌

Women’s ODI World Cup from September 30 : భారత్‌ వేదికగా మహిళల వన్డే వరల్డ్ కప్ టోర్నీ షెడ్యూల్‌ ఖరారైంది. వాస్తవానికి భారత్‌ వేదికగా వరల్డ్ కప్‌లో మొత్తం మ్యాచ్‌లు జరుగాల్సి ఉన్నా పాక్‌తో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలోసెప్టెంబర్‌ 30వ తేదీ నుంచి నవంబర్‌ 2 వరకు మెగా టోర్నీ జరుగనున్నట్లు ఐసీసీ అధికారిక ప్రకటనలో పేర్కొంది.  కొలంబోలో పాకిస్థాన్ మ్యాచ్‌లకు ఏర్పాట్లు చేశారు. బెంగళూరు, గువాహటి, ఇండోర్‌, విశాఖపట్నం, కొలంబో వేదికలుగా ప్రపంచకప్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. సెప్టెంబర్‌ 30న బెంగళూరులో భారత్‌, బంగ్లాదేశ్ పోరుతో టోర్నీకి తెరలేవనుంది. తొలి సెమీస్‌ గువాహటి లేదా కొలంబోలో అక్టోబర్‌ 29వ తేదీన జరుగనుండగా, రెండో సెమీస్‌కు అక్టోబర్‌ 30న బెంగళూరు ఆతిథ్యం ఇవ్వనున్నంది. 12 ఏండ్ల తర్వాత ఆతిథ్యం ఇస్తున్న భారత్‌ టైటిల్‌ ఫెవరేట్‌గా బరిలోకి దిగుతున్నది.

 

ఏసీసీ కప్‌ వాయిదా..
ఈ నెల 6వ తేదీ నుంచి శ్రీలంకలో జరగాల్సి ఉన్న ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ (ఏసీసీ) ఉమెన్స్‌ ఎమర్జింగ్‌ ఆసియా కప్‌ వాయిదా పడింది. టోర్నీకి శ్రీలంక ఆతిథ్యం ఇవ్వాల్సి ఉండగా, ప్రస్తుతం వాతావరణ పరిస్థితులతో పాటు స్థానికంగా చికున్‌ గున్యా పంజా విసురుతున్నది. ఆటగాళ్ల భద్రత నేపథ్యంలో టోర్నీని వాయిదా వేయాలని శ్రీలంక కోరగా, అందుకు ఏసీసీ అంగీకరించింది.

Exit mobile version
Skip to toolbar