Site icon Prime9

China Masters: మళ్లీ బరిలోకి సాత్విక్- చిరాగ్ జోడీ

Satwik-Chirag back on circuit: గాయం కారణంగా ఆటకు దూరమైన భారత డబుల్స్‌ స్టార్లు సాత్విక్‌ సాయిరాజ్, చిరాగ్‌ శెట్టి.. చైనా మాస్టర్స్‌ ప్రపంచ టూర్‌ సూపర్‌ 750 టోర్నీలో తిరిగి రంగంలోకి దిగారు. సాత్విక్‌ భుజానికి గాయం కారణంగా పారిస్‌ ఒలింపిక్స్‌ తర్వాత ఈ జోడీ ఆ తర్వాత జరిగిన ఆర్కిటిక్‌ ఓపెన్, డెన్మార్క్‌ ఓపెన్, చైనా ఓపెన్‌ వంటి ప్రతిష్టాత్మక టోర్నీలకు దూరమైంది. కాగా, గాయం నుంచి సాత్విక్‌ కోలుకోవడంతో మంగళవారం వీరిద్దరూ చైనా మాస్టర్స్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్‌లో లీ హ్యూ- యాంగ్‌ సువాన్‌ (చైనీస్‌ తైపీ) జంటతో ఆరో సీడ్‌ సాత్విక్‌- చిరాగ్‌ జోడీ ఆడనుంది కాగా, పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్లో లీ జియా (మలేసియా)తో లక్ష్యసేన్, చికో వార్దోయో (ఇండోనేసియా)తో ప్రియాన్షు రజావత్‌ పోటీపడుతుండగా, మహిళల సింగిల్స్‌లో బుసానన్‌తో పి.వి.సింధు, లైన్‌ హోజ్‌మార్క్‌ (డెన్మార్క్‌)తో మాళవిక బాన్సోద్, తొమొక మియజాకి (జపాన్‌)తో ఆకర్షి కశ్యప్, బీవెన్‌ జాంగ్‌ (అమెరికా)తో అనుపమ పోరుసలపనున్నారు.

Exit mobile version