Champions Trophy 2025 Pakistan vs New Zealand match : ఛాంపియన్స్ ట్రోఫీ నేటి నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో భాగంగా పాకిస్థాన్‌తో న్యూజిలాండ్ తలపడుతోంది. ఈ మేరకు టాస్ నెగ్గిన పాకిస్థాన్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది.
కరాచీ వేదికగా మ్యాచ్ ప్రారంభమైంది. అయితే ఈ మ్యాచ్‌కు గాయం కారణంగా పాక్ యువ బ్యాటర్ సయీమ్ ఆయుబ్ దూరమయ్యాడు. మరో వైపు న్యూజిలాండ్ ఆల్ రౌండర్ రచిన్ రవీంద్ర కూడా తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. దీంతో రచిన్ మ్యాచ్‌కు దూరం కావడంతో డేవన్ కన్వేతో కలిసి విల్ యంగ్ ఇన్నింగ్స్ ప్రారంభించాడు.
న్యూజిలాండ్:
మిచెల్ సాంట్నర్(కెప్గెన్), టామ్ లేథమ్(వికెట్ కీపర్), డేవన్ కాన్వే, విల్ యంగ్, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, మైకెల్ బ్రాస్ వెల్, నాథన్ స్మిత్, మ్యాట్ హెన్రీ, విలియమ్ రౌర్కీ.
పాకిస్థాన్:
మహమ్మద్ రిజ్వాన్(కెప్టెన్), ఫకర్ జమాన్, బాబర్ అజామ్, సౌద్ షకీల్, సల్మాన్ అఘా, తయ్యబ్ తాహిర్, ఖుష్దిల్ షా, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హారిస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్.