IND vs AUS 1st Test : భారత్ – ఆస్ట్రేలియా మొదటి టెస్ట్ మ్యాచ్.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్

  • Written By:
  • Publish Date - February 9, 2023 / 11:46 AM IST

IND vs AUS 1st Test : నాగ్ పూర్ వేదికగా బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్ట్ ప్రారంభం అయ్యింది.

ఆస్ట్రేలియా జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.

అలన్ బోర్డర్, సునీల్ గవాస్కర్.. ఇండియా, ఆస్ట్రేలియా క్రికెట్ లోని ఆల్ టైమ్ గ్రేట్ ప్లేయర్స్ లో వీళ్ల పేర్లు టాప్ లో ఉంటాయి.

అందుకే ఈ రెండు దేశాల మధ్య జరిగే టెస్ట్ సిరీస్ లకు ఈ ఇద్దరి పేర్ల మీదుగానే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అనే పేరు పెట్టారు.

1996 నుంచి ఈ సిరీస్ జరుగుతోంది. ఇప్పటి వరకూ 15 సిరీస్ లు జరిగాయి.

ఇప్పటి వరకూ జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీల్లో ఇండియాలో కేవలం ఒక్కసారి మాత్రమే ఆస్ట్రేలియా సిరీస్ గెలిచింది.

మొత్తం ఇప్పటి వరకూ 15 సిరీస్ లలో 9 ఇండియా గెలవగా.. ఆస్ట్రేలియా 5 గెలిచింది. మరొకటి డ్రాగా ముగిసింది.

ఇక ఆస్ట్రేలియాలో ఇండియా రెండు సిరీస్ లు సొంతం చేసుకుంది.

(IND vs AUS 1st Test) భారత జట్టు వివరాలు..

రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ (డెబ్యూ), శ్రీకర్ భరత్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్.

ఆస్ట్రేలియా జట్టు వివరాలు..

డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబూషేన్, స్టీవెన్ స్మిత్, మాట్ రెన్షా, పీటర్ హ్యాండ్స్ కాంబ్, అలెక్స్ కారీ(వికెట్ కీపర్), పాట్ కమిన్స్(కెప్టెన్), నాథన్ లియాన్, టాడ్ మర్ఫీ, స్కాట్ బోలాండ్.

 

కాగా ఇప్పటి వరకు స్వదేశంలో భారత్, ఆస్ట్రేలియాల మధ్య 14 టెస్ట్ సిరీస్ లు జరిగితే భారత్ 8 సిరీస్ విజయాలు సాధించింది. ఆసీస్ 4 సిరీసులు గెలిచింది. మరో 2 డ్రా అయ్యాయి.

ఆస్ట్రేలియాతో ఆడిన 102 టెస్టుల్లో భారత్‌ 30 విజయాలు సాధించింది. 43 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. 28 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. మరో మ్యాచ్‌ టైగా ముగిసింది.

నేటి మ్యాచ్ ద్వారా సూర్యకుమార్ యాదవ్‌తో పాటు తెలుగు వికెట్ కీపింగ్ బ్యాటర్ కెఎస్ భరత్, టెస్టు ఆరంగ్రేటం చేస్తున్నారు. సూర్యకి ఇది టెస్టుల్లో మొదటి మ్యాచ్ కాగా కోన శ్రీకర్ భరత్‌కి మొట్టమొదటి అంతర్జాతీయ మ్యాచ్.

శుబ్‌మన్ గిల్‌ని మిడిల్ ఆర్డర్‌లో ఆడిస్తారని ప్రచారం జరిగినా టీ20ల్లో నెం.1 బ్యాటర్‌గా ఉన్న సూర్యకుమార్ యాదవ్‌కి అవకాశం కల్పించింది టీమిండియా.

దీంతో వన్డేల్లో డబుల్ సెంచరీ బాది, టీ20ల్లో సెంచరీ నమోదు చేసి బీభత్సమైన ఫామ్‌లో ఉన్న శుబ్‌మన్ గిల్, నేటి మ్యాచ్‌లో రిజర్వు బెంచ్‌కే పరిమితం అయ్యాడు… 2021లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన సూర్య, రెండేళ్ల తర్వాత టెస్టుల్లో ఎంట్రీ ఇస్తున్నాడు.

టెస్టు సీనియర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాకి రెస్ట్ ఇచ్చినప్పటి నుంచి టెస్టు టీమ్‌తో ట్రావెల్ అవుతున్నాడు కె.ఎస్ భరత్…

రిషబ్ పంత్ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి జట్టుకి దూరం కావడంతో భరత్‌కి ఎట్టకేలకు తుదిజట్టులో ఆడే అవకాశం దక్కింది.

ఐసీసీ టెస్టు టీమ్ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో ఉన్న టీమిండియా, మొదటి స్థానంలో ఉన్న ఆస్ట్రేలియాని కనీసం 2-0 తేడాతో ఓడిస్తే… ఆసీస్‌ని వెనక్కినెట్టి టాప్ ప్లేస్‌ని చేరుకుంటుంది.