Site icon Prime9

Australia Women vs India Women: ఆస్ట్రేలియాతో మూడో వన్డేలోనూ భారత మహిళా టీం ఓటమి

Australia Women beat India Women by 83 runs: ఆస్ట్రేలియాతో మూడో వన్డేలోనూ భారత మహిళా టీం ఓటమిపాలైంది. ఆసీస్‌ నిర్దేశించిన 299 రన్స్ లక్ష్యఛేదనలో భారత్ 215కే చేతులెత్తేసింది. దీంతో 3 వన్డేల సిరీస్‌ను ఆసీస్‌ 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది.

కాగా, అంతకుముందు బ్యాటింగ్ చేపట్టిన ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు గాను 298 పరుగులు చేసింది. ఇందులో అన్నాబెల్ సదర్లాండ్ (110) సెంచరీ, కెప్టెన్ తహ్లియా మెక్‌గ్రాత్ (56), ఆష్లే గార్డెనర్ (50) అర్ధ శతకాలతో మెరిశారు. భారత బౌలర్లలో అరుంధతి 4, దీప్తి ఒక వికెట్ పడగొట్టారు.

తర్వాత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాలో ఓపెనర్ స్మృతి మంధాన (105), హార్లీన్‌ డియోల్ (39) మినహా బ్యాటర్లు ఎవరూ రాణించకపోవటంతో 45.1 ఓవర్ల వద్ద 215 పరుగులకే అనూహ్యంగా ఆలౌటైంది. దీంతో ఆసీస్ 83 పరుగులు తేడాతో గెలిచింది.

Exit mobile version