Site icon Prime9

Australia vs India: తొలి టెస్టులో భారత్ ఆధిపత్యం..యశస్వీ జైస్వాల్ అరుదైన ఘనత

Australia vs India 1st test match Rahul, Jaiswal push India’s lead: పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ ఆధిపత్యం చెలాయిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటుతో తడబడినా, రెండో ఇన్నింగ్స్‌లో సత్తా చాటుతోంది. రెండో రోజు ఆట ముగిసేసరికి టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 172 పరుగులు చేసింది. ఓపెనర్లు యశస్వీ జైస్వాల్ (90 బ్యాటింగ్; 193 బంతుల్లో, 7 ఫోర్లు, 2 సిక్సర్లు), కేఎల్ రాహుల్ (62 బ్యాటింగ్; 153 బంతుల్లో, 4 ఫోర్లు) రాణించారు.

రెండు సిక్సర్లు బాదిన యశస్వీ జైస్వాల్ ఒక అరుదైన ఘనత సాధించాడు. టెస్టు ఫార్మాట్‌లో ఓ క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ప్లేయర్‌గా న్యూజిలాండ్ దిగ్గజ క్రికెటర్ బ్రెండన్ మెక్‌కలమ్ సరసన నిలిచాడు. 2014లో మెక్‌కలమ్ 33 సిక్సర్లు సాధించగా, ఈ ఏడాది అదే ఘనతను జైస్వాల్ అందుకున్నాడు. ఈ జాబితాలో మెక్‌కలమ్, జైస్వాల్ తర్వాతి స్థానాల్లో బెన్ స్టోక్స్ (26 సిక్సర్లు-2022), ఆడమ్ గిల్‌క్రిస్ట్ (22 సిక్సర్లు- 2005), వీరేంద్ర సెహ్వాగ్ (22 సిక్సర్లు- 2008) ఉన్నారు.

Exit mobile version