Site icon Prime9

Partha Chatterjee: విద్యాశాఖలో ప్రతీ పోస్టుకు ఒక రేటు.. ఇదీ పార్ధా చటర్జీ భాగోతం

Partha Chatterjee: పశ్చిమ బెంగాల్‌ మాజీ విద్యాశాఖ మంత్రి పార్ధా చటర్జీ లీలలు ఒక్కొక్కటి వెలుగు చూస్తున్నాయి. మంత్రిగా ఉన్నప్పుడు విద్యశాఖలోని ప్రతి పోస్టుకు ఒక్కొ ధర నిర్ణయించి అందిన కాడికి డబ్బు దండుకున్నాడు పార్ధుడు. ఎలాంటి అనుభవం లేని వారిని కనీస అర్హత లేని వారిని కూడా డబ్బు తీసుకుని ఉద్యోగాలు ఇచ్చిన మహానుభావుడు పార్ధ చటర్జీ. ప్రస్తుతం ఈడీ అదుపులో ఉన్న ఆయన తాను అమాయకుడినని తనకు ఏమీ తెలియదని.. కాలమే అని నిర్ణయిస్తుందని అమయకత్వం నటిస్తున్నాడు.

తృణమూల్‌ కాంగ్రెస్‌ నాయకుడు పార్థా చటర్జీ, ఆయన సహచరుల లీలలు ఒక్కొక్కటి వెలుగు చూస్తున్నాయి. పార్థా సహచరి. సినీ నటి అర్పితా ముఖర్జీ ఇంటి నుంచి ఈడీ అధికారులు ఏకంగా 50 కోట్ల నగదు, విదేశీ కరెన్సీతో పాటు బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. అర్పితా ఇంట్లో రాసులు రాసులుగా పోసిన కరెన్సీ కట్టలు చూసి యావత్‌ దేశం విస్తు పోయింది. మంత్రి సహచరి పశ్చిమ బెంగాల్‌ కాలేజీ, యూనివర్శిటీ ప్రొఫెసర్స్‌ అసోసియేషన్‌ జనరల్‌ సెక్రటరీ బైసాకీ బెనర్జీ… పార్దా చటర్జీ లీలల గురించి పూస గుచ్చినట్లు వివరించారు. మంత్రిగా ఉన్నప్పుడు పార్ధా కాలేజీలో కానీ యూనివర్శిటీలో కానీ ఏదైనా ఖాళీలు ఉంటే వాటికి ధర నిర్ణయించే వాడని, కనీసం స్కూళ్లో చదవు చెప్పని వారిని యూనివర్శిటీలో ఉద్యోగం ఇప్పించారని ఆమె విమర్శలు గుప్పించారు.

ఇక్కడ ఆశ్చర్యం కలిగించే అంశం ఏమిటంటే సాధారణ బ్యాక్‌ గ్రౌండ్‌ ఉన్న వారు… ఎలాంటి అనుభం లేని వారి విద్యారంగంలో శక్తిమంతమైన నాయకులయ్యారు. వీరంతా ఒక సిండికేట్‌గా మారి ప్రతి ఒక్కపోస్టుకు ఒక ధర నిర్ణయించి అందిన కాడికి దండుకున్నారని ఆమె తెలియజేశారు. విద్యార్హత లేని వారు పార్థా చటర్జీ వల్ల ఉద్యోగాలు సంపాదించుకున్నారని ఆమె మండిపడ్డారు. తనను రాజకీయాల్లోకి తెచ్చింది పార్ధా చటర్జీ అని ఆమె చెబుతున్నారు. వ్యవస్థలో అవినీతి బాగా పేరుకుపోయిందని.. మీలాంటి వారు… మంచి కుటుంబం నుంచి వచ్చిన మహిళలు ప్రస్తుతం రాజకీయాలకు తక్షణావసరం అంటూ తనను రాజకీయాల్లోకి లాగడని బైసాకీ బెనర్జీ అన్నారు. అయితే ఇదే పార్థా చటర్జీ రాజకీయాల్లో ఎవరిని ఎదగనీయడని.. పార్ధా ప్రోద్బలంలో తాను 2016లో రాజకీయాల్లోకి వచ్చానని బెనర్జీ పేర్కొన్నారు.

అవినీతి ఆరోపణలపై పార్ధా చటర్జీని ఈడీ అరెస్టు చేసింది. ఎస్‌ఎస్‌సీ స్కామ్‌పై పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో ఈడీ విచారణ జరిపి… అర్పిత ఇంటి నుంచి 50 కోట్ల నగదు స్వాధీనం చేసుకుంది. ప్రస్తుతం వీరిద్దరు ఈడీ కస్టడీలో ఉన్నారు. ఆయన అరెస్టు తర్వాత మమతా బెనర్జీ ఆయనను అన్నీ పదవుల నుంచి తొలగించింది. టీఎంసీ నుంచి కూడా బహిష్కరించింది. ఆయన స్థానంలో కొత్త మంత్రిని కూడా తీసుకున్నారు. రెండు రోజుల క్రితమే మమతా బెనర్జీ తన కేబినెట్‌ను విస్తరించింది. పోయిన పరువును నిలబెట్టుకునేందుకు కేబినెట్‌లో యువకులకు అవకాశం కల్పించారు.

ఇదిలా ఉండగా పార్థ చటర్జీ, అర్పితా ముఖర్జీని ఇరువురిని ఎదురు ఎదురుగా కూర్చోబెట్టి ఈడీ విచారించింది. ఇద్దరు పరస్పర విరుద్దమైన ప్రకటనలు ఇచ్చినందు వల్ల నేరుగా కూర్చోబెట్టి విచారించాల్సి వచ్చింది. ఇరువురు ఒకరిపై ఒకరు నిందలు వేసుకున్నారు. అర్పిత వాదన ఏమిటంటే ఆ డబ్బు తనది కాదని పార్ధా చటర్జీదని, ఆయన అనుచరులు గదిలోకి వచ్చి డబ్బు విషయం చూసి వెళ్లిపోయేవారని చెప్పారు. దీనికి వ్యతిరేకంగా పార్థా కూడా ఆ డబ్బు తనది కాదని వాదిస్తున్నాడు. కాలమే వాస్తవాలు బయటపెడుతుందన్న వేదాంతం వల్లిస్తున్నాడు. విద్యామంత్రిగా పిల్లలకు విద్యాబుద్దులు నేర్పించి మంచి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన పార్ధాలాంటి వారి వల్ల సమాజం ఏ విధంగా బాగుపడుతుంది. పార్థా లాంటి వారిని కఠినంగా శిక్షించి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత మమతా దీదీదే..

Exit mobile version