Site icon Prime9

Hyderabad Metro: హైదరాబాదీలకు ’మెట్రో‘ కష్టాలు

hyderabad-metro

hyderabad-metro

Prime9Special: హైదరాబాదీలను మెట్రో కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. మెట్రోతో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టొచ్చనుకుంటే, ఇప్పుడు సీన్ కాస్త రివర్స్ అయింది. పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యకు విరుగుడుగా మెట్రోను తీసుకొస్తే, అదే మెట్రో ఇప్పుడు సమస్యలతో సతమతమవుతోంది. దీంతో మెట్రో ప్రయాణమంటేనే నగరవాసులు చిరాకు పడుతున్నారు. హైదరాబాద్ మెట్రోలో ప్రయాణీకులు పడుతున్న కష్టాలపై ప్రైమ్9 న్యూస్ స్పెషల్ స్టోరీ

మెట్రోతో ట్రాఫిక్ కష్టాలు తొలగిపోతాయని భావించిన ప్రజలకు నిరాశే ఎదురవుతోంది. ఉదయం సాయంత్రం ఆఫీస్ సమయాల్లో ట్రైన్స్ అన్నీ నిండిపోతున్నాయి. ఒక వేళ ట్రైన్ మిస్ అయితే కొన్ని నిమిషాల పాటు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. పీక్ అవర్స్‎లో మెట్రో రైళ్ళు ఆలస్యంగా నడుస్తుండడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మెట్రో స్టేషన్ వద్ద ఉన్న స్టెప్స్ ఎక్కేందుకు ఎక్కువ టైమ్ తీసుకుంటుండడం. అలాగే స్టేషన్ లోపల ఉండే లిప్ట్, ఎస్కలేటర్లు రద్దీగా ఉండడంతో ప్రయాణీకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక నగరంలో వర్షం కురిసిన రోజు మెట్రో కష్టాలు అన్నీ ఇన్నీ కావు. సర్వర్లు డౌన్ అవ్వడంతో టికెట్లు స్కాన్ అవ్వక ప్రయాణికులు స్టేషన్లలో బారులు తీరుతున్నారు. బస్సులు, ఆటోల్లో వెళ్దామన్నా వర్షాలకు రోడ్లు నదుల్లా మారడంతో మెట్రో స్టేషన్లోనే అవస్థలు పడుతున్నారు.

మరోవైపు కొత్తగా ప్రారంభించిన జేబీఎస్‌-ఎంజీబీఎస్‌ రూట్లో కూడా మెట్రో కష్టాలు వెంటాడుతున్నాయి. చాలా రైళ్లలో డిస్‌ప్లే బోర్డులు లేకపోవడంతో తమ గమ్యస్థానాలను తెలుసుకోలేక ప్రయాణీకులు అవస్థలు పడుతున్నారు. అటు టికెట్ కౌంటర్ల దగ్గర రద్దీని తగ్గించేందుకు క్యూఆర్‌కోడ్ సిస్టమ్‎ను అమల్లోకి తెచ్చినా, మెజారిటీ మెట్రో స్టేషన్లలో స్కానర్లు పనిచేయకపోవడంతో ఇబ్బందులు తప్పడంలేదు. రెండు మూడుసార్లకు పైగా స్కాన్ చేసిన తర్వాతే గేట్లు ఓపెన్ అవుతుండటంతో క్యూలైన్లు పెరిగిపోతున్నాయి. దీంతో ప్రయాణీకులు మెట్రో ప్రయాణం అంటేనే చిరాకు పడుతున్నారు. చిన్న చిన్న సమస్యలతో మెట్రో జర్నీ ఆలస్యమవుతోందని వీటిని త్వరగా పరిష్కరించాలని కోరుతున్నారు.

ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు మెట్రో అందుబాటులోకి వచ్చినా జనం కష్టాలు మాత్రం తీరడంలేదు. చిన్న చిన్న సమస్యలే అయినా అధికారులు పట్టించుకోకపోవడంతో అవస్థలు తప్పడం లేదు. ఇప్పటికైనా మెట్రో అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

 

Exit mobile version
Skip to toolbar