Vidya Balan : ఎలాంటి ఫిల్మ్ బ్యాక్ గ్రౌండ్ లేకుండానే బాలీవుడ్ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి తన నటనతో స్టార్ హీరోయిన్గా ఎదిగింది ” విద్యా బాలన్ “. కేవలం గ్లామర్ పాత్రలకే ప్రాధాన్యం ఇవ్వకుండా.. హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది ఈ సౌత్ ఇండియన్ బ్యూటీ. టాలీవుడ్ లో ఈమె నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన.. ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ‘ఎన్టీఆర్ మహానాయకుడు’లో బసవ తారకం పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయారు. సిల్క్ స్మిత జీవితం ఆధారంగా తెరకెక్కిన ” డర్టీ పిక్చర్ ” విద్యాబాలన్ కెరీర్‌లో ప్రత్యేకం అని చెప్పుకోవాలి. ఈ క్రమంలో ఆ చిత్రానికి విద్యాకు జాతీయ అవార్డు కూడా వచ్చింది. ఆ తరువాత కహాని, శకుంతల, బేగం జాన్ వంటి లేడి ఓరియెంటెడ్ చిత్రాల్లో విద్యా మెప్పించారు. సోషల్ మీడియాలోను యాక్టివ్ గా ఉండే ఈమె తాజాగా తన హాట్ అందాలను ఆరబోస్తూ యూత్ కి పిచ్చెక్కిస్తుంది.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/