Thalapathy 67: ‘దళపతి 67’లో విజయ్, త్రిష హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. తమిళ్ లో వీరిద్దరిది సూపర్ హిట్ జోడీ. చాలా సినిమాల్లో ఈ జోడి కలిసి నటించింది ప్రేక్షకుల మెప్పు పొందింది. అయితే 14 ఏళ్ళ విరామం తర్వాత మళ్ళీ విజయ్, త్రిష ఈ సినిమాలో కలిసి నటిస్తున్నారు.
‘దళపతి 67’లో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్, యాక్షన్ కింగ్ అర్జున్, దర్శకులు గౌతమ్ వాసుదేవ్ మీనన్, మిస్కిన్, నటుడు మన్సూర్ అలీ ఖాన్, మలయాళ నటుడు మాథ్యూ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నట్టు చిత్ర బృందం ఎనౌన్స్ చేశారు.