Priyanka Singh : జబర్దస్త్ ద్వారా తన కెరీర్ ని మొదలు పెట్టింది ప్రియాంకా సింగ్. జబర్దస్త్ లో లేడీ గెటప్స్ వేస్తూ ఉండే సాయి తేజ్.. సడెన్ గా ప్రియాంకా సింగ్.. పింకీగా మారిపోయింది. ఇక కెరీర్ లో ఆమెకు బ్రేక్ వచ్చింది మాత్రం బిగ్ బాస్ తో అనే చెప్పాలి. బిగ్ బాస్ షోలో ఆమె యాటీట్యూడ్, బిహేవియర్, గేమ్ ఆడే విధానం, ముఖ్యంగా మానస్ తో లవ్ ట్రాక్..ఇలా షో అంతా సందడి చేసింది ఈ బ్యూటీ. దాంతో ఆమెకు అభిమానులు భారీగా పెరిగారు. బిగ్ బాస్ షో తర్వాత పింకీకి కచ్చితంగా అవకాశాలు వస్తాయని భావించగా ఆశించిన స్థాయిలో మాత్రం రాలేదు. ఇక సోషల్ మీడియా లోనూ యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ తన ఫోటోలతో యూత్ ని ఆకట్టుకుంటుంది.