Nithyananda Kaisalam : నిత్యానంద స్వామి గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అత్యాచారం, లైంగిక వేధింపులు వంటి ఆరోపణలు ఎదుర్కొంటూ .. భారతదేశంలో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయబడిన ఈయన.. ఒక దేశాన్ని సృష్టించుకోవడం.. తనకు తానే ఆ దేశానికి అధ్యక్షుడిగా ప్రకటించుకోవడం గురించి తెలిసిందే. ఆ దేశానికి కైలాసం అని కూడా పేరు పెట్టారు. కాగా ఇటీవల ఐక్యరాజ్య సమితిలో కైలాస దేశం తరఫున ప్రతినిధులు ప్రసంగించడమే అందుకు నిదర్శనంగా కనిపిస్తుంది. జెనీవాలో ఇటీవల ఐక్యరాజ్య సమితికి చెందిన సీఈఎస్ఆర్ (Committee on Economic, Social and Cultural Rights) 19వ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కైలాస దేశం తరఫున విజయప్రియ నిత్యానంద, ఈఎన్ కుమార్ ప్రతినిధులుగా హాజరయ్యారు. అంతే కాకుండా తమ కైలాస దేశానికి.. 150 దేశాల్లో రాయబార కార్యాలయాలను ఏర్పాటు చేసినట్లు చెప్పడం అందర్నీ విస్మయానికి గురి చేస్తుంది. ఆ ఫోటోలను మీరు ఓ లుక్కేయండి..
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/