Manchu Lakshmi : తెలుగు సినీ పరిశ్రమలో మంచు ఫ్యామిలీకి కూడా ఒక ప్రత్యేక స్థానం ఉంది. మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మీ గురించి తెలుగు ప్రజలకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రకాశ్ కోవెలమూడి దర్శకత్వంలో 2011 లో వచ్చిన ‘అనగనగా ఓ ధీరుడు’ అనే సినిమాతో టాలీవుడ్ కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. లక్ష్మి వెండితెరపైకి రాకముందే బుల్లితెరలో పలు టీవీ షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరించింది. ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటుంది లక్ష్మీ. అలాగే సోషల్ మీడియా లోనూ యాక్టివ్ గా ఉండే మంచు లక్ష్మీ తన లేటెస్ట్ ఫోటోస్, మూవీ అప్డేట్స్ తో అభిమానులకు ఎప్పుడు టచ్ లో ఉంటూనే ఉంటుంది.